iDreamPost
android-app
ios-app

Sunil Narine: వరల్డ్ క్లాస్ బౌలర్ కి చుక్కలు చూపించిన నరైన్! రబాడని ఉతికి ఆరేశాడు!

  • Published Apr 26, 2024 | 8:29 PM Updated Updated Apr 26, 2024 | 8:29 PM

వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన కగిసో రబాడని బెంబేలెత్తించాడు కేకేఆర్ స్టార్ బ్యాటర్ సునీల్ నరైన్. ఇక ఈ మ్యాచ్ లో కేవలం 23 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు నరైన్.

వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన కగిసో రబాడని బెంబేలెత్తించాడు కేకేఆర్ స్టార్ బ్యాటర్ సునీల్ నరైన్. ఇక ఈ మ్యాచ్ లో కేవలం 23 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు నరైన్.

  • Published Apr 26, 2024 | 8:29 PMUpdated Apr 26, 2024 | 8:29 PM
Sunil Narine: వరల్డ్ క్లాస్ బౌలర్ కి చుక్కలు చూపించిన నరైన్! రబాడని ఉతికి ఆరేశాడు!

IPL 2024 సీజన్ లో కేకేఆర్ స్టార్ బ్యాటర్ సునీల్ నరైన్ ఊచకోత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సీజన్ లో మోస్ట్ డేంజరస్ బ్యాటర్ గా కితాబు అందుకుంటున్న నరైన్.. తాజాగా పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన కగిసో రబాడని బెంబేలెత్తించాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా కేకేఆర్ 76 పరుగులు చేసింది.

పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో పంజాబ్ బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన కగిసో రబాడను ఉతికి ఆరేశాడు నరైన్. అతడు వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఫిలిప్ సాల్ట్ తో కలిసి 21 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో చివరి మూడు బంతులను వరుసగా 4, 6, 4 గా బాదాడు. అంతకు ముందు రెండో బంతిని సాల్ట్ ఫోర్ గా మలిచాడు. స్పీడ్ బౌలింగ్ కు పెట్టింది పేరు రబాడ. అలాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎంతో సమర్థవంతగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు నరైన్. ఇక ఈ మ్యాచ్ లో కేవలం 23 బంతుల్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. ప్రస్తుతం 24 బంతుల్లో 8 ఫోర్లు,3 సిక్సులతో 59 పరుగులతో భీకరఫామ్ లో ఉన్నాడు. అతడికి తోడు ఫిలిప్ సాల్ట్ కూడా 46 రన్స్ తో అర్ధసెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం కేకేఆర్ 8 ఓవర్లకు 110 రన్స్ చేసి.. భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique