Somesekhar
KKRతో జరిగిన మ్యాచ్ లో ముంబై 18 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ.. ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నయా చరిత్రను లిఖించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.
KKRతో జరిగిన మ్యాచ్ లో ముంబై 18 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ.. ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నయా చరిత్రను లిఖించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.
Somesekhar
వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది కోల్ కత్తా నైట్ రైడర్స్. తద్వారా ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరిన తొలి టీమ్ గా కేకేఆర్ నిలిచింది. ఇక ఈ మ్యాచ్ లో కేకేఆర్ విధ్వంసకర బ్యాటర్ అయిన సునీల్ నరైన్ ను కళ్లు చెదిరే యార్కర్ తో డకౌట్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన బుమ్రా ఓ రేర్ ఫీట్ ను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఆ ఘనతను నాలుగు సార్లు సాధించిన తొలి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు ఈ స్పీడ్ స్టర్.
జస్ప్రీత్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్న ప్లేయర్లలో ఒకడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 20 వికెట్లు తీసుకుని పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. తద్వారా ఏ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ సాధించలేని ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు నాలుగు సార్లు తీసిన ఏకైక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. బుమ్రా 2017 ఐపీఎల్ సీజన్ లో 20 వికెట్లు, 2020లో 27, 2021లో 21, ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో 20*వికెట్లతో పర్పులు క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. బుమ్రా ఈ రేంజ్ ఫర్పామెన్స్ చూపిస్తున్నప్పటికీ.. ముంబై మాత్రం విజయాలు సాధించలేకపోవడం ఫ్యాన్స్ కు నిరాశను కలిగిస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ 16 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(42) పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇక 158 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 8 వికెట్లు నష్టపోయి 139 పరుగులు మాత్రమే చేసి, 18 తేడాతో ఓడిపోయింది. మరి ఓ ఇండియన్ బౌలర్ గా బుమ్రా సాధించిన ఈ రేర్ ఫీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
– 20 wickets in IPL 2017.
– 27 wickets in IPL 2020.
– 21 wickets in IPL 2021.
– 20* wickets in IPL 2024.Jasprit Bumrah becomes the first Indian fast bowler to have 20 or more wickets in a season four times. 🐐 pic.twitter.com/S7aJLSHauL
— Johns. (@CricCrazyJohns) May 12, 2024