iDreamPost
android-app
ios-app

KKR vs DC: ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర సృష్టించిన KKR!

  • Published Apr 03, 2024 | 9:54 PM Updated Updated Apr 03, 2024 | 9:54 PM

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ సరికొత్త చరిత్రను సృష్టించింది. సునీల్ నరైన్, రఘువంశీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ సరికొత్త చరిత్రను సృష్టించింది. సునీల్ నరైన్, రఘువంశీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

KKR vs DC: ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర సృష్టించిన KKR!

ఢిల్లీ క్యాపిటల్స్ తో వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్స్ సునీల్ నరైన్, రఘువంశీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఢిల్లీ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. సిక్సర్లు, ఫోర్లతో శివమెత్తారు. దీంతో కేకేఆర్ టీమ్ భారీ స్కోర్ సాధించింది. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ తో కోల్ కత్తా టీమ్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆ రికార్డుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సునీల్ నరైన్-రఘువంశీ జోడీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై యుద్ధాన్ని ప్రకటించారు. వీరిద్దరు క్రీజ్ లో ఉన్నంతసేపు ఢిల్లీ బౌలర్లు ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు. ఒకరిని మించి మరోకరు ఫోర్లు, సిక్సర్లతో సునామీ సృష్టించారు. ఈ జోడీ కేవలం 48 బంతుల్లోనే 104 పరుగులు జోడించి ఔరా అనిపించింది. వీరి దంచికొట్టుడికి కేకేఆర్ టీమ్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది కేకేఆర్. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది.

ఈ క్రమంలోనే సునీల్ నరైన్ కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. అతడు ఓవరాల్ గా 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో 18 ఏళ్ల కుర్రాడు రఘువంశీ 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 రన్స్ చేసి డెబ్యూ మ్యాచ్ లోనే ఇరగదీశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రస్సెస్ సైతం తన బ్యాట్ కు పనిచెప్పాడు. కేవలం 19 బాల్స్ లోనే 4 ఫోర్లు,3 సిక్సర్లతో 41 రన్స్ చేశాడు. రింకూ సింగ్ ఫినిషర్ పాత్రను పోషించాడు. ఓ ఫోర్, 3 సిక్సులతో 8 బంతుల్లో 26 రన్స్ చేశాడు. వీరి వీరవిహారం ధాటికి కోల్ కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే 3 వికెట్లు పడగొట్టాడు. మరి పవర్ ప్లేలో చరిత్ర సృష్టించిన కేకేఆర్ టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: మయాంక్ యాదవ్ మరో చరిత్ర.. హేమాహేమీలకే సాధ్యం కాలేదు! ఏకైక ప్లేయర్ గా..