Nidhan
టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ మీద సన్‌రైజర్స్ హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆఖరి బంతికి విజయం సాధించింది. దీంతో కావ్యా పాప వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ మీద సన్‌రైజర్స్ హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆఖరి బంతికి విజయం సాధించింది. దీంతో కావ్యా పాప వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
Nidhan
మరో థ్రిల్లింగ్ మ్యాచ్‌కు ఐపీఎల్-2024 వేదికగా నిలిచింది. లాస్ట్ బాల్ వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. మ్యాచ్ ఆసాంతం ఏ టీమ్ కూడా పూర్తి ఆధిపత్యం చూపించలేదు. కొంతసేపు ఓ జట్టు, మరికొంత సేపు ఇంకో జట్ట డామినేషన్ నడిచింది. అయితే ఆఖరి కొన్ని ఓవర్లలో ఫుల్ కంట్రోల్‌తో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన హైటెన్షన్ మ్యాచ్‌లో కమిన్స్ సేన 1 పరుగు తేడాతో గెలుపొందింది. ఒక దశలో విజయం మీద ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఆశలు వదులుకున్నారు. ఇది కూడా పోయినట్లేనని.. ఇంక టీమ్ పనైపోయిందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు విజయం సాధించారు. దీంతో మ్యాచ్ తర్వాత ఓనర్ కావ్యా మారన్ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ సెలబ్రేషన్స్ బాగా ఫేమస్ అనేది తెలిసిందే. ఎస్ఆర్హెచ్ గెలిచినప్పుడు ఆమె పుల్గా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఓడితే మాత్రం బాధను తట్టుకోలేక ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సీజన్లో మాత్రం ఆమె ఎక్కువగా హ్యాపీగా కనిపిస్తోంది. దీనికి కారణం ఆరెంజ్ ఆర్మీ వరుస విజయాలే. అయితే గత రెండు మ్యాచుల్లో ఎస్ఆర్హెచ్ ఓడటంతో కావ్యా పాప కాస్త డల్ అయింది. కానీ నిన్న రాజస్థాన్ రాయల్స్ మీద ఆఖరి బంతికి విజయం సాధించడంతో ఆమె ఆనందం పట్టలేక ఎగిరి గంతేసింది. చివరి ఓవర్లో ప్రతి బంతికి టెన్షన్ పడ్డ కావ్య.. ఓ దశలో మ్యాచ్ చూడలేనన్నట్లు ముఖాన్ని తన చేతులతో దాచేసింది.
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మ్యాచ్‌లో ఎక్కడ ఓడిపోతామోనని కావ్యా పాప ఆందోళనలో కనిపించింది. అయితే ఆఖరి బంతికి భువనేశ్వర్ కుమార్ వికెట్ తీయడంతో ఆమె సంతోషంలో మునిగిపోయింది. ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. చివరి బంతిని ఎదుర్కొన్న రాజస్థాన్ బ్యాటర్ రోమన్ పావెల్ ఔట్ అని అంపైర్ ప్రకటించగానే ఎగిరి గంతేసింది కావ్యా పాప. ఎస్.. సాధించామంటూ రెండు చేతుల్ని పైకెత్తి ప్లేయర్ల వైపు చూపించిందామె. నవ్వుతూ ఫుల్ జోష్‌లో కనిపించింది. కావ్యతో పాటు సన్‌రైజర్స్ ఆటగాళ్లు, అభిమానులు కూడా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కావ్యా పాపను ఇలా చూస్తుంటే ఆనందంగా ఉందని, ఆమె కోసమైనా ఎస్ఆర్హెచ్ ఈసారి కప్పు కొట్టాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.
The Emotion and Joy of Sunrisers Hyderabad players after won the match. ❤️
– The celebrations and Happiness of Kavya Maran was gold. pic.twitter.com/oADBAst1g5
— Tanuj Singh (@ImTanujSingh) May 2, 2024