IPL 2024: ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల్లో వర్షం వస్తే ఎలా? మ్యాచ్ రద్దు అయితే ఏం చేస్తారంటే?

ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల్లో వర్షం వచ్చి.. మ్యాచ్ రద్దు అయితే ఏం చేస్తారు? రిజల్ట్ ను ఎలా లెక్కిస్తారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల్లో వర్షం వచ్చి.. మ్యాచ్ రద్దు అయితే ఏం చేస్తారు? రిజల్ట్ ను ఎలా లెక్కిస్తారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ ను వరుణుడు చప్పగా చేశాడు. ప్లే ఆఫ్స్ రేసు థ్రిల్లింగ్ గా ఉన్న దగ్గరి నుంచి వరుణుడు అడ్డుపడటంతో.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశ పడ్డారు. ఇక ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ లకు సైతం వర్షం ముప్పు ఉండటంతో.. క్రికెట్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరుణుడి దెబ్బకు కొన్ని మ్యాచ్ లు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల్లో కూడా వర్షం వచ్చి.. మ్యాచ్ రద్దు అయితే ఏం చేస్తారు? రిజల్ట్ ను ఎలా లెక్కిస్తారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఆ లెక్కలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం పదండి.

ఐపీఎల్ 2024లో భాగంగా ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ లో కేకేఆర్ ను ఢీకొనబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. అహ్మదాబాద్ వేదికగా మే 21(మంగళవారం) ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల్లో కూడా వర్షం వస్తే ఎలా? అంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. కాగా.. వర్షం వచ్చినా అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే? ప్లే ఆఫ్ మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉంటుంది. అందులో భాగంగా.. మ్యాచ్ జరిగే రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తే.. మ్యాచ్ ను ముగించేందుకు మరో 120 నిమిషాలు అందుబాటులో ఉంటుంది. లీగ్ మ్యాచ్ ల్లో ఈ సమయం 60 నిమిషాలుగా ఉంటుంది.

కాగా.. రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడి, మ్యాచ్ రద్దు అయితే ఏంటి సంగతి? అన్న డౌట్ అందరిలో ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ కేకేఆర్-సన్ రైజర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే.. కేకేఆర్ ఫైనల్ కు వెళ్తుందన్నమాట. మరోవైపు ఎలిమినేటర్ మ్యాచ్ కూడా ఇలాగే రద్దు అయితే.. ఆర్సీబీ కంటే రాజస్తాన్ కు పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాజస్తాన్ ను విజేతగా ప్రకటిస్తారు. ఇక అభిమానులు మాత్రం వర్షం పడకూడదు అంటూ ప్రార్థిస్తున్నారు.

Show comments