Somesekhar
తాజాగా జరిగిన RCB vs KKR మ్యాచ్ లో ఎవ్వరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
తాజాగా జరిగిన RCB vs KKR మ్యాచ్ లో ఎవ్వరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తూ.. సాగిపోతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ నమోదైంది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కత్త నైట్ రైడర్స్ మధ్య సూపర్ మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ పోరులో కేకేఆర్ టీమ్ అదిరిపోయే విక్టరీ కొట్టింది. బెంగళూరు విధించిన లక్ష్యాన్ని ఆడుతూ.. పాడుతూ.. 16.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆర్సీబీ ఖాతాలో రెండో ఓటమి చేరింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదేంటంటే?
ఆర్సీబీ-కేకేఆర్ టీమ్స్ మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రన్ మెషిన్ మరోసారి తన బ్యాట్ కు పనిచెప్పాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో గ్రీన్(33), మాక్స్ వెల్(28) చివర్లో ఫినిషర్ దినేష్ కార్తీక్ 8 బంతుల్లో 3 సిక్సులతో 20 రన్స్ చేశాడు.
అనంతరం 183 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ టీమ్ కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(30), సునీల్ నరైన్(47) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ 6.3 ఓవర్లలోనే 86 పరుగులు పిండుకున్నారు. మరీ ముఖ్యంగా నరైన్ దుమ్మురేపే ఆటతో చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సులతో 47 రన్స్ చేశాడు. ఆ తర్వాత మిగతా పనిని వెంకటేష్ అయ్యర్(50), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39*) పూర్తి చేశారు. దీంతో 16.5 ఓవర్లకే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి కేకేఆర్ టీమ్ లక్ష్యాన్ని ఛేదించింది.
ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఇది చూసిన ప్రేక్షకులు కంగుతిన్నారు. మ్యాచ్ తర్వాత కింగ్ విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ హాగ్ చేసుకున్నారు. దీంతో సహచరులు కూడా అవాక్కైయ్యారు. ఈ అన్ ఎక్స్పెక్టెడ్ సీన్ ను టీవీల్లో చూసిన అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మాజీ క్రికెటర్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగిన విషయం మనందరికి తెలిసిందే. పైగా గంభీర్ టైమ్ చిక్కినప్పుడల్లా కోహ్లీపై విమర్శలు చేయడం తెలిసిందే. మరి గంభీర్-కోహ్లీ హగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
VIRAT KOHLI HUGGING GAUTAM GAMBHIR. 💥 pic.twitter.com/jOj5vNO6n9
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2024
ఇదికూడా చదవండి: LSG vs PBKS.. లక్నో vs పంజాబ్.. గెలుపెవరిదంటే.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!