Somesekhar
తాజాగా కొందరు ఆర్సీబీ ఆటగాళ్లపై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహానికి గురైన వారిలో కోహ్లీ కూడా ఉండటం గమనార్హం. ఫ్యాన్స్ కోపానికి కారణం ఏంటంటే?
తాజాగా కొందరు ఆర్సీబీ ఆటగాళ్లపై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహానికి గురైన వారిలో కోహ్లీ కూడా ఉండటం గమనార్హం. ఫ్యాన్స్ కోపానికి కారణం ఏంటంటే?
Somesekhar
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ లో ఏ టీమ్ కు లేనీ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఏం లాభం? ఇసుమంతైనా అదృష్టం లేదు. అందుకే ఈ సీజన్ లో 8 మ్యాచ్ ల్లో 7 ఓడిపోయి దాదాపు ఇంటిదారి పట్టింది. టీమ్ లో వరల్డ్ క్లాస్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లుగా తయ్యారైంది ఆర్సీబీ పరిస్థితి. ఇక తమ అభిమాన టీమ్ వరుస ఓటములతో సతమతమవుతుంటే ఆ బాధను జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అయితే తాజాగా కొందరు ఆర్సీబీ ఆటగాళ్లపై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహానికి గురైన వారిలో కోహ్లీ కూడా ఉండటం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందంటే?
ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ కథ దాదాపుగా ముగిసినట్లే. ఇప్పటికే 8 మ్యాచ్ ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించి, మిగతా మ్యాచ్ ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి ప్లేస్ లో ఉంది. ప్లే ఆఫ్ కు చేరే విషయం గురించి చర్చించాల్సిన పనే లేదు. ఇలాంటి టైమ్ లో విరాట్ కోహ్లీతో పాటుగా మరికొందరు ఆర్సీబీ ప్లేయర్లు చేసిన పనికి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించే పని వారు ఏం చేశారంటే? ఆర్సీబీ తన నెక్ట్స్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది. ఇందుకోసం హైదరాబాద్ చేరుకుంది.
అయితే విరాట్ కోహ్లీ ‘వన్8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన బ్రాంచ్ హైదరాబాద్ లో కూడా ఉంది. దీంతో తన రెస్టారెంట్ కు ఆర్సీబీ ప్లేయర్లు అయిన అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, కరణ్ శర్మ, సుయాశ్ ప్రభుదేశాయ్, వైశాక్ లను తన రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు కోహ్లీ. అక్కడ వీరందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పార్టీ పిక్స్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 మ్యాచ్ ల్లో 7 ఓడిపోయారన్న విషయం గుర్తుందా మీకు? కొంచెమైనా బాధ్యత ఉండాలి కదా విరాట్ బ్రో, ఈ పార్టీలు ఏంటి? ఇప్పటికైనా మారండి.. అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం వారికి సపోర్ట్ గా నిలిచారు. తన సొంత రెస్టారెంట్ చూపించడానికి తీసుకెళ్లాడు, అందులో తప్పు ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Anuj Rawat, Lomror, Karn, Suyash & Vyshak with Virat Kohli at the One8 Commune in Hyderabad. 👌 pic.twitter.com/BKl7PUp9Uv
— Johns. (@CricCrazyJohns) April 24, 2024