iDreamPost
android-app
ios-app

IPL 2024: ఢిల్లీ జట్టులోకి విధ్వంసకర ప్లేయర్.. ఇక పరుగుల వరదే!

  • Published Apr 24, 2024 | 9:19 AM Updated Updated Apr 24, 2024 | 9:19 AM

గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మెుత్తానికే దూరమైయ్యాడు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్. అయితే అతడి ప్లేస్ లో సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ ను తీసుకోవాలని భావిస్తోంది. అతడు ఎవరంటే?

గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మెుత్తానికే దూరమైయ్యాడు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్. అయితే అతడి ప్లేస్ లో సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ ను తీసుకోవాలని భావిస్తోంది. అతడు ఎవరంటే?

IPL 2024: ఢిల్లీ జట్టులోకి విధ్వంసకర ప్లేయర్.. ఇక పరుగుల వరదే!

ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శనను చూపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఇక ఇప్పటికే ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీకి మిచెల్ మార్ష్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తొడకండరాల గాయం కారణంగా మార్ష్ ఈ సీజన్ మెుత్తానికే దూరమైయ్యాడు. ఇక అతడి ప్లేస్ లో సౌతాఫ్రికా విధ్వంసకర ప్లేయర్ ను తీసుకోవాలని ఢిల్లీ మేనేజ్ మెంట్ భావిస్తున్నాట్లు తెలుస్తోంది. అతడు టీమ్ లోకి వస్తే.. పరుగుల వరద ఖాయమే.

గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ కు దూరమైయ్యాడు ఢిల్లీ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్. అయితే అతడి స్థానాన్ని ఓ మెరుపు బ్యాటర్ తో భర్తీ చేయాలని చూస్తోంది ఢిల్లీ యాజమాన్యం. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ రస్సీ వాండర్ డస్సెన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్ లో డస్సెన్ రూ. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగాడు. కానీ అతడిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు.

కాగా.. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడిన ఈ సౌతాఫ్రికా స్టార్ అక్కడ దుమ్ములేపాడు. ఆ లీగ్ లో కేవలం 7 మ్యాచ్ లు మాత్రమే ఆడిన డస్సెన్ 364 పరుగులతో లీగ్ లో సెకండ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్ లో కూడా అతడు సూపర్ ఫామ్ ను కనబర్చాడు. దీంతో అతడిని మార్ష్ ప్లేస్ లో తీసుకోవాలని ఢిల్లీ భావిస్తోంది. కాగా.. డస్సెన్ గతంలో రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే గత ఫామ్ ను బట్టి చూస్తే.. డస్సెన్ ఒకవేళ ఢిల్లీ జట్టులోకి వస్తే.. పరుగులు వరద ఖామని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.