iDreamPost
android-app
ios-app

Sanju Samson: కాంట్రవర్సీ క్యాచ్.. అంపైర్ తో శాంసన్ గొడవ! వీడియో వైరల్..

  • Published May 08, 2024 | 7:35 AM Updated Updated May 08, 2024 | 7:35 AM

అంపైర్ల తప్పుడు డెసిషన్ కు బలైయ్యాడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. దాంతో కోపంతో అతడు వారితో వాగ్వాదానికి దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

అంపైర్ల తప్పుడు డెసిషన్ కు బలైయ్యాడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. దాంతో కోపంతో అతడు వారితో వాగ్వాదానికి దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

Sanju Samson: కాంట్రవర్సీ క్యాచ్.. అంపైర్ తో శాంసన్ గొడవ! వీడియో వైరల్..

ఈ ఐపీఎల్ సీజన్ లో ఆటగాళ్ల సృష్టించే వివాదాల కంటే అంపైర్లు నెలకొల్పే గొడవలే ఎక్కువ అవుతున్నాయి. అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ ఫలితాలే తారుమారు అవుతున్నాయి. దీంతో అంపైర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. తాజాగా అంపైర్ల తప్పుడు డెసిషన్ కు బలైయ్యాడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. దాంతో కోపంతో అతడు వారితో వాగ్వాదానికి దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో రాజస్తాన్ కు ఊహించని షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్స్ టీమ్ గెలవాల్సింది. కానీ అంపైర్ల తప్పుడు నిర్ణయం వల్ల ఫలితం మారిపోయింది. ఏం జరిగిందంటే? ఢిల్లీ నిర్ధేశించిన 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ టీమ్ లో కీలక బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే వీరోచిత బ్యాటింగ్ తో టార్గెట్ ను ఛేదించే దిశగా సాగుతున్న సమయంలో అంపైర్ల తప్పుడు నిర్ణయానికి బలైయ్యాడు సంజూ శాంసన్. ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగో బంతిని స్ట్రైట్ గా భారీ షాట్ ఆడాడు శాంసన్. అయితే బాల్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న షై హోప్ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్ పట్టే సమయంలో అతడు బౌండరీ లైన్ కు తాకినట్లు కనిపించింది. దీంతో అంపైర్లకు ఇదే విషయాన్ని చెప్పాడు శాంసన్. కానీ రిప్లేలో చూసిన తర్వాత థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో.. సహనం కోల్పోయిన శాంసన్ ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. వారి డెసిషన్ మార్చుకోకపోవడంతో.. నిరాశగానే పెవిలియన్ చేరాడు సంజూ. ఈ మ్యాచ్ లో శాంసన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 86 రన్స్ చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జట్టులో జేక్ ఫ్రేజర్( 20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగులు చేశాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 20 బంతుల్లో 41 రన్స్ తో థండర్ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్తాన్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి, 20 రన్స్ తేడాతో ఓడిపోయింది. అంపైర్ల తప్పుడు నిర్ణయం కారణంగా ఈ మ్యాచ్ లో రాజస్తాన్ ఓడిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.