Nidhan
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ఛీటింగ్ చేయడం కాంట్రవర్సీగా మారింది. ఎవరా బ్యాటర్? క్లియర్ ఔట్ అని తెలిసినా ఎందుకు అలా చేశాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ఛీటింగ్ చేయడం కాంట్రవర్సీగా మారింది. ఎవరా బ్యాటర్? క్లియర్ ఔట్ అని తెలిసినా ఎందుకు అలా చేశాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
క్రికెట్లో హుందాతనం అనేది చాలా ముఖ్యం. ఒకప్పుటి ఆటగాళ్లలో ఇది కనిపించేది. అప్పట్లో బ్యాటర్లు నాటౌట్ అయినా.. అంపైర్ ఔట్ ఇస్తే కిమ్మనకుండా క్రీజును వీడేవారు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. తాను నాటౌట్ అని తెలిసినా అంపైర్ ఔట్ ఇస్తే వెంటనే క్రీజును వీడేవాడు సచిన్. ఒక్కోసారి అంపైర్ ఇవ్వకపోయినా.. తాను ఔట్ అయ్యాననే డౌట్ వచ్చినా వెళ్లిపోయేవాడు. అలాంటి ప్లేయర్లు ఇప్పుడు తగ్గిపోయారు. ఔట్ ఇచ్చినా క్రీజును వీడని కొందరు మొండి బ్యాటర్లు ఉన్నారు. తాము నాటౌట్ అంటూ బుకాయించేవాళ్లు ఉన్నారు. అలాంటి ఓ ఘటనే ఐపీఎల్-2024లో ఇవాళ చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ఇలాగే ఛీటింగ్ చేశాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డీసీ బ్యాటర్ రికీ భుయ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన భుయ్‌ను హర్మన్‌ప్రీత్ బ్రార్ ఔట్ చేశాడు. అతడి బౌలింగ్‌లో లెగ్ సైడ్ పడిన బంతిని ఆడబోయి కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు భుయ్. దాన్ని పట్టుకున్న జితేష్, బౌలర్ బ్రార్ అప్పీల్ చేశారు. అయితే అంపైర్ ఔట్ ఇవ్వలేదు. భుయ్ కూడా బంతి తన బ్యాట్‌కు తగల్లేదని బుకాయించాడు. అడ్డంగా తల ఊపుతూ అది నాటౌట్ అన్నాడు. కానీ అది పక్కా ఔట్ అని ఫిక్స్ అయిన పంజాబ్ జట్టు రివ్యూకు వెళ్లింది. తీరా డీఆర్ఎస్లో చూస్తే భుయ్ క్లియర్ ఔట్ అని తేలింది. బంతి అతడి బ్యాట్‌ను ఎడ్జ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో అందరూ రికీ భుయ్‌ను ట్రోల్ చేస్తున్నారు.
క్లియర్ ఔట్ అని తెలిసినా భుయ్ క్రీజును వదల్లేదని.. అతను చీట్ చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. ఔట్ అని తెలిసి హుందాగా వెళ్లిపోతే గౌరవంగా ఉండేదని, కానీ ఇలా మోసం చేసేందుకు ప్రయత్నించడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఒకవేళ రివ్యూకు వెళ్లపోకపోయి ఉంటే అతడి చీటింగ్ బయటపడేది కాదని.. ఆ తర్వాత రీప్లేలో ఔట్ అని తెలిసినా అందరూ లైట్ తీసుకునేవారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఆడిన భుయ్.. కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన డీసీ.. అన్ని ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన పంజాబ్ టార్గెట్‌ను 19.2 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. మరి.. భుయ్ వ్యవహారంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Harpreet Brar gets Ricky Bhui for 3️⃣ and Delhi Capitals lost their 5th wicket on 1️⃣1️⃣1️⃣
📸: JioCinema#HarpeetBrar #RickyBhui #PBKSvDC #IPL2024 #IPL #CricketTwitter pic.twitter.com/li3lcgdj21
— InsideSport (@InsideSportIND) March 23, 2024