iDreamPost
android-app
ios-app

DC బ్యాటర్ ఛీటింగ్.. క్లియర్​ ఔట్ అని తెలిసినా..!

  • Published Mar 23, 2024 | 10:10 PM Updated Updated Mar 23, 2024 | 10:10 PM

ఢిల్లీ క్యాపిటల్స్​ బ్యాటర్ ఛీటింగ్ చేయడం కాంట్రవర్సీగా మారింది. ఎవరా బ్యాటర్? క్లియర్ ఔట్ అని తెలిసినా ఎందుకు అలా చేశాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ క్యాపిటల్స్​ బ్యాటర్ ఛీటింగ్ చేయడం కాంట్రవర్సీగా మారింది. ఎవరా బ్యాటర్? క్లియర్ ఔట్ అని తెలిసినా ఎందుకు అలా చేశాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 23, 2024 | 10:10 PMUpdated Mar 23, 2024 | 10:10 PM
DC బ్యాటర్ ఛీటింగ్.. క్లియర్​ ఔట్ అని తెలిసినా..!

క్రికెట్​లో హుందాతనం అనేది చాలా ముఖ్యం. ఒకప్పుటి ఆటగాళ్లలో ఇది కనిపించేది. అప్పట్లో బ్యాటర్లు నాటౌట్ అయినా.. అంపైర్ ఔట్ ఇస్తే కిమ్మనకుండా క్రీజును వీడేవారు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్​ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. తాను నాటౌట్ అని తెలిసినా అంపైర్ ఔట్ ఇస్తే వెంటనే క్రీజును వీడేవాడు సచిన్. ఒక్కోసారి అంపైర్ ఇవ్వకపోయినా.. తాను ఔట్ అయ్యాననే డౌట్ వచ్చినా వెళ్లిపోయేవాడు. అలాంటి ప్లేయర్లు ఇప్పుడు తగ్గిపోయారు. ఔట్ ఇచ్చినా క్రీజును వీడని కొందరు మొండి బ్యాటర్లు ఉన్నారు. తాము నాటౌట్ అంటూ బుకాయించేవాళ్లు ఉన్నారు. అలాంటి ఓ ఘటనే ఐపీఎల్-2024లో ఇవాళ చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ఇలాగే ఛీటింగ్ చేశాడు.

పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో డీసీ బ్యాటర్ రికీ భుయ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఇంపాక్ట్ ప్లేయర్​గా బరిలోకి దిగిన భుయ్​ను హర్మన్​ప్రీత్ బ్రార్ ఔట్ చేశాడు. అతడి బౌలింగ్​లో లెగ్ సైడ్ పడిన బంతిని ఆడబోయి కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు భుయ్. దాన్ని పట్టుకున్న జితేష్, బౌలర్ బ్రార్ అప్పీల్ చేశారు. అయితే అంపైర్ ఔట్ ఇవ్వలేదు. భుయ్ కూడా బంతి తన బ్యాట్​కు తగల్లేదని బుకాయించాడు. అడ్డంగా తల ఊపుతూ అది నాటౌట్ అన్నాడు. కానీ అది పక్కా ఔట్ అని ఫిక్స్ అయిన పంజాబ్ జట్టు రివ్యూకు వెళ్లింది. తీరా డీఆర్​ఎస్​లో చూస్తే భుయ్​ క్లియర్ ఔట్ అని తేలింది. బంతి అతడి బ్యాట్​ను ఎడ్జ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో అందరూ రికీ భుయ్​ను ట్రోల్ చేస్తున్నారు.

క్లియర్ ఔట్ అని తెలిసినా భుయ్ క్రీజును వదల్లేదని.. అతను చీట్ చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. ఔట్ అని తెలిసి హుందాగా వెళ్లిపోతే గౌరవంగా ఉండేదని, కానీ ఇలా మోసం చేసేందుకు ప్రయత్నించడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఒకవేళ రివ్యూకు వెళ్లపోకపోయి ఉంటే అతడి చీటింగ్ బయటపడేది కాదని.. ఆ తర్వాత రీప్లేలో ఔట్ అని తెలిసినా అందరూ లైట్ తీసుకునేవారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో 7 బంతులు ఆడిన భుయ్.. కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన డీసీ.. అన్ని ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన పంజాబ్ టార్గెట్​ను 19.2 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. మరి.. భుయ్ వ్యవహారంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.