DC vs GT: పిచ్చి పట్టిందా? అంటూ కుల్దీప్ ఆగ్రహం! పాపం ముకేశ్ కుమార్.. వీడియో వైరల్!

DC vs GT మధ్య జరిగిన మ్యాచ్ లో నీకేమైనా పిచ్చిపట్టిందా? అంటూ తన సహచర ఆటగాడు ముకేశ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

DC vs GT మధ్య జరిగిన మ్యాచ్ లో నీకేమైనా పిచ్చిపట్టిందా? అంటూ తన సహచర ఆటగాడు ముకేశ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

IPL 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను 6 వికెట్లతో చిత్తు చేసిది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. ఇక ఈ మ్యాచ్ లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా సమష్టిగా రాణించి విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో తన సహచరుడు అయిన ముకేశ్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. దీంతో పంత్ మధ్యలో జోక్యం చేసుకుని కుల్దీప్ ను కూల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 8వ ఓవర్ బౌలింగ్ చేయాడనికి వచ్చాడు ఆ జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అప్పుడు క్రీజ్ లో రాహుల్ తెవాటియా-అభినవ్ మనోహర్ ఉన్నారు. ఇక ఈ ఓవర్ 5వ బంతిని తెవాటియా షాట్ ఆడబోయి విఫలం అయ్యాడు. అయితే తెవాటియా రన్ కోసం వస్తాడని భావించిన మనోహర్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చాడు. ఇంతలో బంతిని అందుకున్న ముకేశ్ కుమార్ ను బంతిని మనోహర్ వైపు త్రో వేయాల్సిందిగా ఆదేశించాడు పంత్. దాంతో అటువైపే వేగంగా త్రో చేశాడు ముకేశ్. ఇది గమనించిన మనోహర్ వెనక్కి పరిగెత్తాడు. కానీ బాల్ ను పట్టుకోవడంలో విఫలమైయ్యాడు కుల్దీప్. ఆ బాల్ కాస్త ఓవర్ త్రో కావడంతో.. ఆగ్రహానికి గురైన కుల్దీప్..’నీకేమైనా పిచ్చి పట్టిందా?’ అంటూ ముకేశ్ పై సీరియస్ అయ్యాడు.

ఇక ఇంతలో పంత్ వచ్చి.. కోపం వద్దు భయ్యా అంటూ కుల్దీప్ ను కూల్ చేశాడు. ఇదంతా చూస్తున్న ముకేశ్ కు ఏం చేయాలో తెలీక చిరునవ్వులు చిందించాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్లేయర్లు సహనం కోల్పోవడం సహజమే. క్యాచ్ లు మిస్ అయినప్పుడు ఆటగాళ్లు ఇలా తమ నోటికి పనిచెబుతుంటారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఢిల్లీ బౌలర్ల ధాటికి కేవలం 89 రన్స్ కే కుప్పకూలింది. అనంతరం 90 పరుగుల టార్గెట్ ను 4 వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలో ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో కుల్దీప్ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కాకపోతే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

Show comments