Somesekhar
KKRతో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 68 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు శశాంక్ సింగ్. దీంతో పంజాబ్ టీమ్ హిస్టారికల్ విజయాన్ని నమోదు చేసింది. అయితే శశాంక్ మెరుపు ఇన్నింగ్స్ పై హ్యాపీగా లేనని షాకింగ్ కామెంట్స్ చేశాడు సౌతాఫ్రికా మాజీ పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్. మరి దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
KKRతో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 68 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు శశాంక్ సింగ్. దీంతో పంజాబ్ టీమ్ హిస్టారికల్ విజయాన్ని నమోదు చేసింది. అయితే శశాంక్ మెరుపు ఇన్నింగ్స్ పై హ్యాపీగా లేనని షాకింగ్ కామెంట్స్ చేశాడు సౌతాఫ్రికా మాజీ పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్. మరి దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో టీమిండియా యువ సంచలనం శశాంక్ సింగ్ అదరగొడుతున్నాడు. అనుకోకుండా పంజాబ్ టీమ్ లోకి వచ్చి.. వారికి వరంగా మారాడు. ఇక ఈ సీజన్ లో మెరుపు బ్యాటింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా టీమ్ కు అద్భుత విజయాలను అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 67.7 సగటుతో, 182 స్ట్రైక్ రేట్ తో 263 పరుగులు చేశాడు. అందులో రెండు మెరుపు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రికార్డు స్కోర్ ఛేజింగ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది పంజాబ్. ఈ మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అయితే శశాంక్ మెరుపు ఇన్నింగ్స్ పై హ్యాపీగా లేనని సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
కేకేఆర్ విధించిన 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించి.. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ప్లేయర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సెక్సులతో 54 పరుగులు, జానీ బెయిర్ స్టో 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 108 పరుగులు చేసి అజేయ సెంచరీతో నిలిచాడు. ఇక అతడికి తోడు చిచ్చరపిడుగు శశాంక్ సింగ్ ఈ మ్యాచ్ లో కూడా తన విశ్వరూపం చూపాడు. 28 బంతుల్లోనే 68 పరుగులతో నాటౌట్ గా నిలిచి.. జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. శశాంక్ మెరుపు బ్యాటింగ్ పై సంతోషంగా లేనంటున్నాడు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ బౌలర్ డేల్ స్టేయిన్. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
“శశాంక్ సింగ్ కేకేఆర్ పై చేసిన అద్భుత బ్యాటింగ్ పై నేను సంతోషంగా ఉండలేపోతున్నాను. ఎందుకంటే? అతడు గతంలో నాతో పాటుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఆడాడు. అప్పుడు ఇంతలా రెచ్చిపోయి ఆడలేదు. అయితే శశాంక్ మాత్రం మంచి మనిషి. టీమ్ కు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాడు. జట్టు కోసం ఎంతో కష్టపడతాడు. ఫేస్ పై ఎల్లప్పుడు చిరునవ్వు ఉంటుంది. గొప్ప ప్రదర్శన ఇచ్చావ్ శశాంక్” అంటూ వ్యాఖ్యానించాడు స్టెయిన్. కొన్ని సంవత్సరాల క్రితం వీరిద్దరు కలిసి సన్ రైజర్స్ కు ఆడారు. అప్పట్లో అతడు బాగా ఆడలేదని, ఇప్పుడు ఇరగదీస్తున్నాడని అందుకే హ్యాపీగా లేననే ఉద్దేశంలో స్టెయిన్ ఈ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి శశాంక్ పై స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dale Steyn lauds Shashank Singh for his masterful innings in the historic chase of 262 runs, marking a significant victory in T20 cricket history. pic.twitter.com/z7OGnJ8mxZ
— CricTracker (@Cricketracker) April 26, 2024
SHASHANK SINGH, THE FINISHER. 🫡
– The consistency of an Indian uncapped player is remarkable. pic.twitter.com/bJpfOj4PsL
— Johns. (@CricCrazyJohns) April 26, 2024