Ruturaj Gaikwad: ఓడినా.. చరిత్ర సృష్టించిన గైక్వాడ్! ధోని ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్!

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. తన పేరిట ఓ అరుదైన రికార్డ్ ను నెలకొల్పాడు. ఈ క్రమంలో ధోని రికార్డ్ ను బ్రేక్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. తన పేరిట ఓ అరుదైన రికార్డ్ ను నెలకొల్పాడు. ఈ క్రమంలో ధోని రికార్డ్ ను బ్రేక్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న(బుధవారం) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సీఎస్కేకి ఊహించని షాకిచ్చింది. మోస్తారు స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో పంజాబ్ సమష్టిగా రాణించి విజయం సాధించి.. తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. మిగతా బ్యాటర్లు విఫలమైన చోట 62 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలోనే ధోని ఆల్ టైమ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు గైక్వాడ్. ఆ వివరాల్లోకి వెళితే..

రుతురాజ్ గైక్వాడ్.. ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో, 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే తన పేరిట ఓ అరుదైన రికార్డ్ ను నెలకొల్పాడు. అదేంటంటే? ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన చెన్నై కెప్టెన్ గా రుతురాజ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు గైక్వాడ్ 10 మ్యాచ్ లు ఆడి 509 పరుగులు చేశాడు. తద్వారా ధోని క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. గతంలో ధోని ఐపీఎల్ 2013 సీజన్ లో 461 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సీఎస్కే కెప్టెన్ చేసిన అత్యధిక పరుగుల రికార్డ్ గా కొనసాగుతుంది. తాజాగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేశాడు రుతురాజ్. అదీకాక ఈ సీజన్ లో లీడింగ్ స్కోరర్ గా కూడా కొనసాగుతూ.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. 500 రన్స్ చేసిన కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను పంజాబ్ బౌలర్లు నిలువరించారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. గైక్వాడ్(62), రహానే(29) రన్స్ చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 163 పరుగుల టార్గెట్ ను 3 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో ఛేదించింది పంజాబ్. జట్టులో బెయిర్ స్టో(46), రొసో(43), శశాంక్ సింగ్(25*), సామ్ కర్రన్(26*) పరుగులతో రాణించారు. మరి రుతురాజ్ గైక్వాడ్ ధోని ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments