Shubman Gill: గెలుపు జోష్ లో ఉన్న గుజరాత్ కు అనుకోని షాక్.. ఏంటంటే?

చెన్నైపై 35 పరుగుల తేడాతో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న గుజరాత్ కు ఊహించని షాక్ తగిలింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నైపై 35 పరుగుల తేడాతో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న గుజరాత్ కు ఊహించని షాక్ తగిలింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్లు జూలు విదిల్చారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో విజయం సాధించి.. తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్ మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో.. 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం చెన్నైని 196 పరుగులకు కట్టడి చేసింది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి జోష్ లో ఉన్న గుజరాత్ కెప్టెన్ కు అనుకోని షాక్ తగిలింది. అదేంటంటే?

చెన్నై సూపర్ కింగ్స్ పై సాధించిన అద్భుత విజయంతో గుజరాత్ టీమ్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ గెలుపుతో తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది జీటీ టీమ్. ఇదిలా ఉండగా.. గెలుపుతో సంతోషంగా గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్ కు రూ. 24 లక్షల జరిమానా విధించారు. గిల్ తో పాటుగా టీమ్ మెుత్తానికి ఆరు లక్షలు లేదా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 25 శాతం(ఏది తక్కువైతే అది) జరిమానా విధిస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే? ఈ మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ గా రాహుల్ తెవాటియా వ్యవహరించినప్పటికీ గిల్ కు జరిమానా విధించడం గమనార్హం.

కాగా.. ఈ సీజన్ లో గుజరాత్ ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా బారిన పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇలాగే ఇంకోసారి జరిగితే కెప్టెన్ పై మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఇక ఈ సీజన్ లో గుజరాత్ ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో 5 గెలిచి, 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం 10 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది. మరి గెలుపు జోష్ లో ఉన్న గుజరాత్ కెప్టెన్ కు ఫైన్ విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments