iDreamPost
android-app
ios-app

వీడియో: ఖాళీ స్టేడియంలో జడేజా విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌! ఎందుకిలా చేశాడంటే..?

  • Published May 10, 2024 | 12:21 PM Updated Updated May 10, 2024 | 12:21 PM

చెన్నై స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా విచిత్రంగా ఖాళీ గ్రౌండ్ లో విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి జడేజా ఎందుకు ఇలా చేశాడు?

చెన్నై స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా విచిత్రంగా ఖాళీ గ్రౌండ్ లో విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి జడేజా ఎందుకు ఇలా చేశాడు?

వీడియో: ఖాళీ స్టేడియంలో జడేజా విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌! ఎందుకిలా చేశాడంటే..?

సాధారణంగా క్రికెటర్లు హాఫ్ సెంచరీ, లేదా సెంచరీ చేస్తే.. సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. దీంతోపాటుగా జట్టు విజయం సాధిస్తే.. తమ సంతోషాన్ని ఇతర ఆటగాళ్లతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఒక్కో ప్లేయర్ ఒక్కో రీతిలో తమ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అలా ప్రపంచ క్రికెట్ లో కొందరికి సిగ్నేచర్ స్టెప్పులు కూడా ఉన్నాయి. ఇదంతా మనకు తెలిసిందే. అయితే. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా మాత్రం కాస్త విచిత్రంగా ఖాళీ గ్రౌండ్ లో విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి జడేజా ఎందుకు ఇలా చేశాడు? తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు(శుక్రవారం) అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే. మరీ ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కు. అందుకోసం ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ ను మెుదలుపెట్టాయి. ఇక ప్రాక్టీస్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖాళీ గ్రౌండ్ లో బంతి లేకుండానే ఓ షాట్ ఆడి విన్నింగ్ సెలబ్రేషన్స్ ను చేసుకున్నాడు. గ్రౌండ్ మెుత్తం ఉరుకుతూ.. ప్రేక్షకులు ఉన్నారని ఊహించుకునే వారివైపు చూస్తూ.. తన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. జడేజా ఇలా ఎందుకు చేశాడా? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. అయితే గుజరాత్ తో అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ఉండటంతో.. గతాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకున్నాడు జడ్డూ భాయ్.  అదేంటంటే?

2023 ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ లో ఇదే అహ్మదాబాద్ వేదికగా చెన్నై-గుజరాత్ టీమ్స్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేేసింది. అనంతరం 215 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగింది చెన్నై టీమ్. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో.. మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించి.. చెన్నై లక్ష్యాన్ని 171గా నిర్ణయించారు. ఈ టార్గెట్ ను చివరి బంతికి ఛేదించి ఐపీఎల్ 2023 కప్ ఎగరేసుకుపోయింది చెన్నై. చివరి బాల్ షాట్ ఎలా ఆడాడో.. తాజాగా ప్రాక్టీస్ లో అచ్చం అలానే షాట్ కొట్టి, ఖాళీ గ్రౌండ్ లో తన సంతోషాన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకున్నాడు జడేజా. దీంతో ఇదా సంగతి అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఖాళీ గ్రౌండ్ లో జడేజా చేసుకున్న సెలబ్రేషన్స్ మీకెలా అనిపించాయో, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.