Nidhan
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐపీఎల్-2024కి రెడీ అవుతోంది. మరో కప్పుపై కన్నేసింది ధోని సేన. ఈ నేపథ్యంలో ఆ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐపీఎల్-2024కి రెడీ అవుతోంది. మరో కప్పుపై కన్నేసింది ధోని సేన. ఈ నేపథ్యంలో ఆ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఐపీఎల్ జాతర మొదలయ్యేందుకు మరో రెండ్రోజుల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో అందరూ ఏ టీమ్ బలంగా ఉంది? ఏ జట్టు ఎంత వరకు వెళ్లగలదు? ఏయే ప్లేయర్లు రాణిస్తారు? అంటూ రకరకాల విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అందరూ ఎక్కువగా సెర్చ్ చేస్తోంది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ గురించే. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన సీఎస్కే ఈసారి కూడా కప్పు కొడుతుందా అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధోని సేన బలాబలాలు, గత రికార్డులు, విజయావకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సీఎస్కే అతిపెద్ద బలం కెప్టెన్ ధోని. గెలుపు ఆనుపాలు మాహీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదనే చెప్పాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు సుదీర్ఘ కాలం నాయకత్వ బాధ్యతలు చేపడుతూ వచ్చిన ఆ లెజెండరీ క్రికెటర్ వికెట్ల వెనుక ఉండి టీమ్‌ను సమర్థంగా నడిపించడం చెన్నైకి ఉన్న బిగ్ స్ట్రెంగ్త్. రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానె, రచిన్ రవీంద్ర, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ధోని, మెయిన్ అలీతో ఆ టీమ్ బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది. ఓపెనర్లుగా రుతురాజ్-రహానె లేదా రుతురాజ్-రచిన్ జోడీ దిగొచ్చు. ఏ పెయిర్ దిగినా అదరగొట్టడం పక్కాగా కనిపిస్తోంది. సీఎస్కే తమ హోమ్ గ్రౌండ్లో 7 మ్యాచులు ఆడుతుంది. టర్న్‌కు సహకరించే చెన్నై పిచ్‌పై ప్రత్యర్థులను తిప్పేయడానికి జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్ రూపంలో ముగ్గురు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉండటం కూడా ఆ టీమ్‌కు కలిసొచ్చే అంశం.
ఓవరాల్‌గా చూస్తే సీఎస్కే పేపర్ మీద చాలా బలమైన జట్టుగా కనిపిస్తోంది. కానీ లోతుగా పరిశీలిస్తే కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. గత సీజన్లో అదరగొట్టిన లంక పేస్ సంచలనం మతీష పతిరానా గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. అతడి రికవరీ, కమ్‌బ్యాక్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ అయిన పతిరానా లేని లోటు తప్పకుండా సీఎస్కేను ఇబ్బంది పెడుతుంది. దీపక్ చాహర్, తుషార్ పాండే మిడిల్ ఓవర్లలో ఎక్కువ రన్స్ లీక్ చేయడం కూడా మైనస్ పాయింట్ అనే చెప్పాలి. డెవాన్ కాన్వే రూపంలో మరో క్వాలిటీ ప్లేయర్ దూరమవడం చెన్నైకి పెద్ద సమస్యగా మారింది. గత సీజన్లో 16 మ్యాచుల్లో 672 పరుగులు చేశాడు కాన్వే. ఆ సీజన్లో రుతురాజ్‌తో కలసి అద్భుతమైన ఆరంభాలు అందిస్తూ.. చెన్నై విన్నర్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. అలాంటోడు ఈసారి మిస్సవడంతో చెన్నైకి ఎటూ పాలుపోవడం లేదు.
ఐపీఎల్లో అత్యధిక సార్లు కప్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో కలసి చెన్నై (5 సార్లు) ఫస్ట్ ప్లేసులో ఉంది. దీన్ని బట్టే క్యాష్ రిచ్ లీగ్‌లో ఆ టీమ్ ట్రాక్ రికార్డు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదు సార్లు కూడా ధోనీనే సారథిగా ముందుండి టీమ్‌ను నడిపించాడు. గత సీజన్లో టైటిల్‌ను గెలుచుకున్న సీఎస్కే.. అంతకుముందు ఏడాది మాత్రం లీగ్‌లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, 2021లో ఛాంపియన్‌గా నిలిచింది.
సీఎస్కే బలాబలాలు, గత రికార్డులు దృష్టిలో ఉంచుకొని చూస్తే ఆ జట్టు ఈసారి కూడా మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా ధోని సేనను ఎవరూ ఆపలేరు. అయితే ఫైనల్స్‌కు క్వాలిఫై అవ్వాలన్నా, కప్పు కొట్టాలన్నా ధోని మాస్టర్ మైండ్‌తో పాటు మిగిలిన ప్లేయర్లు కూడా కంబైన్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అందరూ సమష్టిగా ఆడితే మాహీ సేన మరో కప్పు ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇదీ చదవండి: IPL 2024: SRH నిర్ణయానికి అశ్విన్ షాక్! కావ్యా ఇంత బ్యాడ్ గా ఆలోచించిందా?