IPL 2024: CSKకి ఊహించని ఎదురుదెబ్బ.. ఒకేసారి ఐదుగురు బౌలర్లు దూరం!

ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టంగా మారిన సమయంలో ఏకంగా ఐదుగురు బౌలర్లు జట్టుకు దూరం కావడంతో.. చెన్నై సూపర్ కింగ్స్ లో ఆందోళన మెుదలైంది. మరి ఒకేసారి ఇంతమంది బౌలర్లు టీమ్ నుంచి దూరం కావడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి.

ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టంగా మారిన సమయంలో ఏకంగా ఐదుగురు బౌలర్లు జట్టుకు దూరం కావడంతో.. చెన్నై సూపర్ కింగ్స్ లో ఆందోళన మెుదలైంది. మరి ఒకేసారి ఇంతమంది బౌలర్లు టీమ్ నుంచి దూరం కావడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి.

IPL 2024లో భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉన్న చెన్నైకి ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టంగా మారిన సమయంలో ఏకంగా ఐదుగురు బౌలర్లు జట్టుకు దూరమైన సంఘటన ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. ఇది సీఎస్కేకు కోలుకోని దెబ్బగా మారింది. అయితే వారు జట్టులోకి తిరిగి ఎప్పుడు వస్తారన్నదానిపై కూడా క్లారిటీ లేకపోవడం కొసమెరుపు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్ పై ఓడిపోయిన బాధలో ఉన్న చెన్నైకి ఎవ్వరూ ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన ఐదుగురు ప్లేయర్లు ఒకేసారి టీమ్ కు దూరమైయ్యారు. అయితే చెన్నై తన నెక్ట్స్ మ్యాచ్ ఆడటానికి మూడు రోజుల సమయం ఉంది. వచ్చే ఆదివారం(మే 5) ఇదే పంజాబ్ టీమ్ తో తలపడనుంది. దాంతో కనీసం ఇద్దరు అయినా మ్యాచ్ కు అందుబాటులోకి వస్తారని చెన్నై మేనేజ్ మెంట్ భావిస్తోంది. అసలేం జరిగిందంటే? ముస్తాఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్ పాండే, దీపక్ చాహర్, పతిరణ, తీక్షణ ఈ ఐదుగురు ప్రస్తుతం చెన్నై జట్టుకు దూరమైయ్యారు.

జింబాబ్వేతో జరిగే 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం బంగాదేశ్ వెళ్తున్నాడు ముస్తాఫిజుర్. ఈ సిరీస్ మే 12న ముగుస్తుంది. అయితే ఆ తర్వాత మే 20 నుంచి అమెరికాతో మరో టీ20 సిరీస్ ఆడనుంది బంగ్లా. దీంతో ముస్తాఫిజుర్ తిరిగి చెన్నై టీమ్ లో చేరడం దాదాపు అసాధ్యమే. ఇక నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డాడు దీపక్ చాహర్. అతడు కేవలం రెండు బంతులు మాత్రమే వేసి డ్రెస్సింగ్ రూమ్ కు చేరాడు. ఇప్పటి వరకు దీపక్ గాయంపై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ అతడు కోలుకోవడానికి కనీసం 4 రోజులు పడుతుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. తుషార్ దేశ్ పాండే అనారోగ్యానికి గురై పంజాబ్ తో జరిగిన మ్యాచ్ కూడా ఆడలేదు. అతడు ఎప్పుడు కోలుకుంటాడో కూడా తెలీదు. ఇక పతిరణ, తీక్షణ వరల్డ్ కప్ వీసాల కోసం శ్రీలంకకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఐదుగురు బౌలర్లు సీఎస్కే టీమ్ ను వీడటంతో.. మేనేజ్ మెంట్ కు ఫ్యాన్స్ కు ఎక్కడా లేని టెన్షన్ మెుదలైంది. అయితే పతిరణ, తీక్షణల వీసా ప్రాసెస్ త్వరగానే ముగుస్తుందని, వారు నెక్ట్స్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఇక ఈ సీజన్ లో 10 మ్యాచ్ లు ఆడిన చెన్నై 5 విజయాలు, 5 అపజయాలతో నాలుగో స్థానంలో ఉంది. మరి ఒకేసారి ఐదుగురు బౌలర్లు దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments