IPL 2024: ప్లే ఆఫ్స్ ముందు CSKకి కోలుకోలేని ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం!

ప్లే ఆఫ్స్ కు చేరే కీలక సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు దూరం కాగా.. ఇప్పడు గాయం కారణంగా మరో కీలక ప్లేయర్ ఇంటిదారి పట్టాడు. దీంతో చెన్నైకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.

ప్లే ఆఫ్స్ కు చేరే కీలక సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు దూరం కాగా.. ఇప్పడు గాయం కారణంగా మరో కీలక ప్లేయర్ ఇంటిదారి పట్టాడు. దీంతో చెన్నైకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.

IPL 2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ కోసం జట్టు నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పటికే కేకేఆర్, రాజస్తాన్ టీమ్స్ దాదాపుగా తమ ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం చెన్నై,  సన్ రైజర్స్, లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ హోరాహోరిగా తలపడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ గాయం కారణంగా సీజన్ లో మిగతా మ్యాచ్ లకు దూరం కానున్నట్లు సమాచారం. ఇది చెన్నైకి కోలుకోలేని షాకే. మరి కీలక మ్యాచ్ ల ముందు గాయపడ్డ ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడి.. 6 విజయాలు సాధించింది. ఇంక ఆడాల్సిన మ్యాచ్ లు మూడే ఉండటం.. ప్లే ఆఫ్ కు చేరాలంటే దాదాపు అన్ని మ్యాచ్ లు గెలవాల్సిన పరిస్థితి. దీంతో 9 విజయాలు సాధించి చెన్నై ప్లే ఆఫ్ కు వెళ్లొచ్చు. అయితే ఇలాంటి కీలక టైమ్ లో సీఎస్కేని శని పట్టుకుంది. ఆ జట్టులోని స్ఠార్ ప్లేయర్లు అంతా ఒక్కొక్కరుగా గాయపడుతూ.. టీమ్ కు దూరమవుతున్నారు. ఇప్పటికే బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ జింబాబ్వే పర్యటన కారణంగా స్వదేశానికి వెళ్లగా.. దీపక్ చాహర్ గాయపడ్డాడు. అతడు ఎప్పుడు కోలుకుంటాడో సరైన సమాచారం కూడా లేదు.

ఈ నేపథ్యంలో సీఎస్కేకు ఊహించని షాక్ తగిలింది. వీసా కోసం శ్రీలంక వెళ్లొచ్చిన మతీషా పతిరణ గాయపడ్డాడు. ఈ విషయాన్ని చెన్నై మేనేజ్ మెంట్ కూడా ధృవీకరించింది. “మతీషా పతిరణ తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం శ్రీలంక వెళ్తున్నాడు” అని సీఎస్కే ప్రకటించింది. గాయం కారణంగా అతడు ఈ సీజన్ మెుత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. కీలక మ్యాచ్ ల ముంగిట సీఎస్కేకు భారీ షాక్ తగిలినట్లే. పతిరణ ఈ సీజన్ లో ఆడిన 6 మ్యాచ్ ల్లో 13 వికెట్లు తీశాడు. తన బౌలింగ్ తో మ్యాచ్ ను ప్రత్యర్థి నుంచి లాగేసుకోవడంలో సిద్ధహస్తుడు పతిరణ. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ తో జరగనున్న సిరీస్ కోసం మెుయిన్ అలీ సైతం జట్టును వీడనున్నాడు. దీంతో చెన్నైకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై ఎలా రాణిస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments