Nidhan
సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఈసారి ఐపీఎల్లో ఎవరు గెలుస్తారో చెప్పేశాడు. తన ప్రెడిక్షన్ ప్రకారం ఆ జట్టే విజేతగా నిలుస్తుందని అన్నాడు.
సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఈసారి ఐపీఎల్లో ఎవరు గెలుస్తారో చెప్పేశాడు. తన ప్రెడిక్షన్ ప్రకారం ఆ జట్టే విజేతగా నిలుస్తుందని అన్నాడు.
Nidhan
ఐపీఎల్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ మొదలవడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ సీజన్‌లోని ఆరంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆర్సీబీ జట్టు అక్కడికి చేరుకుంది. ధోని సేన ఆల్రెడీ చెపాక్‌లోనే ప్రాక్టీస్ చేస్తోంది. సీజన్ స్టార్టింగ్ మ్యాచే సీఎస్కే, ఆర్సీబీ లాంటి టాప్ టీమ్స్ మధ్య ఉండటంతో హైప్ భారీగా నెలకొంది. ఈ మ్యాచ్‌తో పాటు టోర్నీలోని మిగతా మ్యాచుల్లో ఎవరు గెలుస్తారు? కప్పు ఎవరు కొడతారు? అనేది అందరూ చర్చించుకుంటున్నారు. మాజీ క్రికెటర్లు దీనిపై రకరకాల ప్రెడిక్షన్స్ ఇస్తున్నారు. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా తన ప్రెడిక్షన్ చెప్పేశాడు. ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌లో టైటిల్ సొంతం చేసుకునేది ఆ జట్టేనని అన్నాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, గతేడాది రన్నరప్ గుజరాత్ టైటాన్స్ మీద ఈ సీజన్లో భారీగా అంచనాలు ఉన్నాయి. మిగతా అన్ని జట్లు కూడా పటిష్టంగానే కనిపిస్తున్నా వీటి మీదే అందరి ఫోకస్ ఉంది. అయితే డివిలియర్స్ మాత్రం ఈ రెండు జట్లు కాదని ఆర్సీబీకి మొగ్గు చూపుతున్నాడు. ఈసారి ఐపీఎల్లో కప్పు కొట్టేది బెంగళూరేనని జోస్యం చెప్పాడు. విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ మహిళా జట్టు విజేతగా నిలిచింది కాబట్టి.. పురుషుల జట్టు కూడా దాన్ని కంటిన్యూ చేయాలని సూచించాడు. క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏదైనా బోరింగ్‌గా ఉంటుందన్నాడు ఏబీడీ. ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందని తాను బలంగా నమ్ముతున్నానని తెలిపాడు. డివిలియర్స్ వ్యాఖ్యలతో ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఏకీభవించాడు.
ఈసారి ఐపీఎల్లో విజేతగా నిలిచే అవకాశాలు ఆర్సీబీకి ఎక్కువగా ఉన్నాయని బ్రెట్ లీ చెప్పాడు. ఇక, ఈ సీజన్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే కూడా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చూసేందుకు తాను ఎగ్జయిటింగ్‌గా ఉన్నానని డివిలియర్స్ అన్నాడు. ‘జైస్వాల్ ఆట చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా. తన బ్యాట్ పవరో ఏంటో టెస్ట్ ఫార్మాట్లో అతడు చూపించాడు. ఇప్పుడు టీ20ల్లో తన టాలెంట్ చూపించాల్సిన టైమ్ వచ్చేసింది. ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుతంగా ఆడటంతో అతడు సూపర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. దీంతో ఐపీఎల్‌లోనూ మెరుపులు మెరిపిస్తాననే నమ్మకంతో జైస్వాల్ కనిపిస్తున్నాడు. ఈ సీజన్లో అతడు కనీసం 500 నుంచి 600 పరుగులు చేస్తాడని అనుకుంటున్నా’ అని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. మరి.. ఆర్సీబీదే కప్పు అంటూ ఏబీడీ చేసిన ప్రెడిక్షన్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
AB De Villiers backs RCB to win the IPL 2024. (News18). pic.twitter.com/sdrgH21bby
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2024