ప్రపంచంలో ఎన్నో క్రీడలు ఉన్నాగానీ క్రికెట్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైంది. అయితే వరల్డ్ కప్ లాంటి ఎన్ని మెగాటోర్నీలు గెలిచినా.. ఒలింపిక్స్ లో సాధించిన ఒకే ఒక్క గోల్డ్ మెడల్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. అంతటి ఖ్యాతి ఒలింపిక్స్ క్రీడలకు వరల్డ్ వైడ్ గా ఉంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఒలింపిక్స్ లో క్రికెట్ లాంటి జెంటిల్ మెన్ గేమ్ లేకపోవడం ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురిచేస్తూ వస్తోంది. 1900లో తొలిసారి జరిగిన ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీనిని ఈ మెగా ఈవెంట్ నుంచి తొలగించారు. మళ్లీ 128 సంవత్సరాల తర్వాత తిరిగి క్రికెట్ ఒలింపిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ క్రికెట్ పై సంచలన నిర్ణయం తీసుకుంది. లాస్ ఏంజెల్స్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 128 సంవత్సరాల క్రికెట్ కల ఫలించినట్లు అయ్యింది. కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ ను ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఒలింపిక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో వారందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. చివరిసారిగా క్రికెట్ 1900లో పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ప్రవేశపెట్టారు.
ఆ తర్వాత పలు కారణాలతో ఈ జెంటిల్ మెన్ గేమ్ ను తొలగించారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది క్రికెట్. దీంతో క్రికెట్ ఆడే దేశాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలన్న నిర్ణయాన్ని ఎల్ఏ28 కమిటీ తీసుకుని, దానిని ఆమోదించాల్సిందిగా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి సిఫారసు చేసింది. ఈ సిఫారసును పరిశీలించిన ఐఓసీ తాజాగా దీనికి అంగీకారం తెలిపింది. మరి ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Cricket will make its re-entry to the Olympics for the first time in 128 years!
– Last time it was played in the 1900 Paris Olympics….!!! pic.twitter.com/E0UU2hwPNy
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 13, 2023