iDreamPost
android-app
ios-app

భారత క్రికెటర్‌ భజ్జీ మతం మారాలనుకున్నాడు! పాకిస్థాన్‌ క్రికెటర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

  • Published Nov 15, 2023 | 9:18 AM Updated Updated Nov 15, 2023 | 9:18 AM

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఇస్లాం మతంలోకి మారాలని అనుకున్నాడంటూ ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మరి భజ్జీ ఎందుకు ఇస్లాంలోకి మారాలని అనుకున్నాడు? అసలు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఇస్లాం మతంలోకి మారాలని అనుకున్నాడంటూ ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మరి భజ్జీ ఎందుకు ఇస్లాంలోకి మారాలని అనుకున్నాడు? అసలు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Nov 15, 2023 | 9:18 AMUpdated Nov 15, 2023 | 9:18 AM
భారత క్రికెటర్‌ భజ్జీ మతం మారాలనుకున్నాడు! పాకిస్థాన్‌ క్రికెటర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులు దృష్టి మొత్తం వన్డే వరల్డ్‌ కప్‌ 2023పై ఉంది. బుధవారం ముంబైలోని వాంఖడే వేదికగా ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న తొలి సెమీ ఫైనల్‌ కోసం క్రికెట్‌ లోకం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే.. ఇదే సమయంలో ఓ పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హర్భజన్‌ సింగ్‌ ఇస్లాం మతం మారేందుకు సిద్ధం అయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. పాకిస్థాన్‌ టీమ్‌లో ఆడినా.. వివాదరహితుడిగా పేరు తెచ్చకున్న ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌.

ఈ పాకిస్థానీ మాజీ కెప్టెన్‌.. తాజాగా ఓ మస్జీద్‌లో ఇస్లాం బోదనలు చేస్తూ.. ఇంజుమామ్‌ ఈ విధంగా కామెంట్ చేశాడు. ఆయన మాట్లాడుతూ..‘మేము క్రికెట్‌ ఆడుతున్న సమయంలో సాయంత్రం ముగరీబ్‌ నమాజ్‌ చేసేవాళ్ల.. మౌలానా తరీక్‌ జమీల్‌ సాబ్‌ నమాజ్‌ చేయించేవాళ్లు. ఆ సమయంలో మాతో పాటు కొంతమంది భారత క్రికెటర్లు కూడా వచ్చేవారు. అయితే వారు నమాజ్‌ ఆచరించకున్నా.. జమీల్‌ సాబ్‌ బోదనలు వినేవాళ్లు. ఆయన బోదనలు విన్న హర్భజన్‌ సింగ్‌.. నాతో ఇలా అన్నాడు.. నాకెందుకో ఆయన మాట వినాలనిపిస్తోంది.(ఇస్లాం స్వీకరించడం గురించి) కానీ, మిమ్మల్ని చూసి ఆగిపోతున్నాను అన్నాడు. అలా అన్నావేంటి అని అడిగా.. మీరంతా ఇస్లాంని సరిగ్గా పాటించడం లేదని తెలిపాడు.’ అంటూ ఇంజుమామ్‌ వెల్లడించాడు.

మస్జీద్‌లో కూర్చున్న వాళ్లకు.. తాము ఇస్లాంని సరిగా పాటించడం లేదని చెప్పే క్రమంలో ఇంజుమామ్‌.. హర్భజన్‌ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడాడు. అయితే.. ఇంజుమామ్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారమే రేగింది. భారత క్రికెట్‌ అభిమానులు ఇంజుమామ్‌ ఇచ్చిన ఉపన్యాసంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హర్భజన్‌ సింగ్‌ సైతం ఇంజుమామ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఏం తాగి మాట్లాడాతారో తెలియదు ఇలాంటి వాళ్లు. నేను ఓ భారతీయుడిగా, ఓ సిక్కుగా గర్వపడుతున్నాను అంటూ.. కోపంతో ఉన్న ఎమోజీలను జత చేస్తూ.. ట్విట్‌ చేశాడు. మరి ఇంజుమామ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.