చరిత్ర తిరగరాసిన భారత మహిళా క్రికెటర్లు.. ఒకరోజు 525 పరుగులు!

INDW vs SAW- Team India Created History In Test Cricket: టీమిండియా మహిళా క్రికెటర్లు చరిత్రను తిరగరాశారు. టెస్టు క్రికెట్లో ఒకేరోజులో అత్యధిక పరుగులు చేసి రికార్డులు బద్దలు కొట్టారు. హర్మన్ ప్రీత్ కౌర్ సేన అందరినీ అబ్బుర పరిచింది.

INDW vs SAW- Team India Created History In Test Cricket: టీమిండియా మహిళా క్రికెటర్లు చరిత్రను తిరగరాశారు. టెస్టు క్రికెట్లో ఒకేరోజులో అత్యధిక పరుగులు చేసి రికార్డులు బద్దలు కొట్టారు. హర్మన్ ప్రీత్ కౌర్ సేన అందరినీ అబ్బుర పరిచింది.

టీమిండియా మహిళా క్రికెటర్లు చరిత్ర తిరగరాశారు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో పరుగుల వరద పారించారు. అంతేకాకుండా.. తొలిరోజే రికార్డుల మోత మోగించారు. ఈ టెస్టు మ్యాచ్ ఇంకా నాలుగు రోజులు మిగిలి ఉండగానే.. టీమిండియా మహిళా క్రికెటర్లు ఊహకు అందని రికార్డులను క్రియేట్ చేసింది. టెస్టుల్లో ఒకే రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా.. మహిళలు, పురుషుల జట్టులో ఒకేరోజులో హయ్యెస్ట్ రన్స్ స్కోర్ చేసిన టీమ్ గా భారత మహిళా క్రికెటర్లు నిలిచారు. ఈ టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఎన్ని రికార్డులు బద్దలు కొట్టారో చూద్దాం.

టీమండియా మహిళలు- సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా అరుదైన ఘనతను సాధించింది. ఒకేరోజు 525 పరుగులు చేసి చరిత్ర తిరగరాసింది. టెస్టుల్లో ఒకేరోజు అత్యధిక పరుగులు నమోదు చేశారు. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. మొదటి నుంచి అటాకింగ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లకు ఎక్కడా ఆస్కారం లేకుండా షెఫాలీ వర్మా, స్కృతి మందన్నా ఆడారు. తొలి వికెట్ తీసుకోవడానికి సౌత్ ఆఫ్రికా బౌలర్లకు 52 ఓవర్లు పట్టింది. 292 పరుగులకు తొలి వికెట్ పడింది. స్మృతి మందన్నా 149 పరుగులు చేసి పెవిలయన్ చేరింది. ఈ మ్యాచ్ లో 27 ఫోర్లు ఒక సిక్సర్ తో సత్తా చాటింది. ఆ తర్వాత షెఫాలీ వర్మా దూకుడు పెంచేసింది. మహిళల టెస్టు క్రికెట్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.

షెఫాలీ వర్మా ఈ టెస్టులో తన కెరీర్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేసింది. లేడీ సెహ్వాగ్ అనే బిరుదును సొంతం చేసుకున్న షెఫాలీ అంతే దూకుడుగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇప్పుడు టెస్టు క్రికెట్ లో తన సత్తా చాటుతోంది. ఈ మ్యాచ్ లో కేవలంల 191 బంతుల్లోనే డబుల్ సెంచరీ నమోదు చేసింది. ఈ స్కోర్ తో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన మహిళా క్రికెటర్ గా షెఫాలీ వర్మా నిలిచింది. ఇప్పటివరకు ఆ రికార్డు ఆస్ట్రేలియా ప్లేయర్ అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్ లో షెఫాలీ 197 బంతుల్లో ఏకంగా 205 పరుగులు చేసింది. వాటిలో 23 ఫోర్లు, 8 సిక్సర్స్ ఉన్నాయి. తొలి 100 పరుగులు చేసేందుకు 113 బంతులు తీసుకున్న షెఫాలీ.. ఆ తర్వాత 100 పరుగులు మాత్రం కేవలం 78 బంతుల్లోనే చేసేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మహిళల జట్టు తొలిరోజు 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత షెఫాలీ వర్మా(205), స్మృతి మందన్నా(149) దూకుడు ప్రదర్శించారు. ఆ తర్వాత వచ్చిన సుభాష్ సతీశ్(15), జెమీమా(55) ఆకట్టుకున్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(42*), రిచా ఘోష్ (43*) ప్రస్తుతం క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. కానీ, తొలిరోజు వికెట్ల విషయంలో పర్వాలేదు అనిపించారు. డెల్మీ టక్కర్ కు 2 వికెట్లు దక్కాయి. నడిన్ డే క్లర్క్ కు ఒక వికెట్ దక్కింది. షెఫాలీ వర్మా రనౌట్ అయ్యింది. మరి.. భారత మహిళా క్రికెటర్లు ఒకేరోజు 525 పరుగులు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments