iDreamPost
android-app
ios-app

IND vs SL: నేడే శ్రీలంకతో ఆఖరి టీ20! భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

  • Published Jul 30, 2024 | 8:12 AM Updated Updated Jul 30, 2024 | 8:12 AM

IND vs SL, Playing 11: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని భారత జట్టు.. నేడు ఆఖరి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ 11తో బరిలోకి దిగనుందో తెలుసుకుందాం..

IND vs SL, Playing 11: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని భారత జట్టు.. నేడు ఆఖరి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ 11తో బరిలోకి దిగనుందో తెలుసుకుందాం..

  • Published Jul 30, 2024 | 8:12 AMUpdated Jul 30, 2024 | 8:12 AM
IND vs SL: నేడే శ్రీలంకతో ఆఖరి టీ20! భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

శ్రీలంక పర్యటనలో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఈ రోజు(మంగళవారం) చివరి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిసిన విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి గెలిచిన సూర్య సేన, రెండో మ్యాచ్‌లో సూపర్‌ ఛేజింగ్‌తో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమిండియా ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. మరి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. ప్రధాన ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక రెండో మ్యాచ్‌ ఆడని గిల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా? లేదా? అనేది ఇంకా తెలియదు. అతను కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో వేగంగా 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌, అర్షదీప్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యా వికెట్లు తీస్తున్నారు. సిరాజ్‌ కూడా తన స్టామినా చూపిస్తే.. టీమిండియాకు తిరుగుండదు. అయితే.. తొలి రెండు మ్యాచ్‌ల విజయంతో సిరీస్‌ వశం కావడంతో.. భారత్‌ మూడో టీ20లో ప్రయోగాలు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ సిరీస్‌లో బెంచ్‌కే పరిమితం అయిన ఆటగాళ్లకు చివరి మ్యాచ్‌లో అవకాశం ఇచ్చిన బెంచ్‌ స్ట్రెంత్‌ను పరీక్షించాలని హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ భావిస్తున్నట్లు సమాచారం. సీనియర్‌ క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా, సిరాజ్‌లతో పాటు రియాన్‌ పరాగ్‌లకు రెస్ట్‌ ఇచ్చి.. వారి స్థానంలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని శివమ్‌ దూబే, ఖలీల్‌ అహ్మద్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను బరిలోకి దింపాలని చూస్తున్నారు. అలాగే మెడనొప్పితో బాధపడుతున్న ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఎలాగో శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉండటంతో అతనికి కూడా రెస్ట్‌ ఇచ్చి.. సంజు శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వాలని కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు హెడ్‌కోచ్‌ గంభీర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా బెంచ్‌లో ఉన్న వారికి అవకాశం ఇచ్చినా.. టీమిండియా సూపర్‌ స్ట్రాంగ్‌గానే ఉంది. మరి కిందున్న ప్లేయింగ్‌ ఎలెవన్‌ను చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా)
యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అర్షదీప్‌ సింగ్‌.