డొమినికా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ విజయాన్ని సాధించింది. మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో సైతం అశ్విన్ తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో మరింతగా చెలరేగి 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో విండీస్ రెండో ఇన్నింగ్స్ లో130 పరుగులకే కుప్పకూలింది. మెుత్తంగా ఈ మ్యాచ్ లో అశ్విన్ 12 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డును సృష్టించాడు అశ్విన్. దాంతో టీమిండియా రెండవ బౌలర్ గా ఘనతకు ఎక్కాడు.
వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా వెంటరన్ స్పిన్నర్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్ లో 700 వికెట్లు సాధించి చరిత్ర సృష్టించిన అశ్విన్ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్ తో మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీయడం ద్వారా అశ్విన్.. టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన 2వ బౌలర్ గా ఘనత వహించాడు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజం అనిల్ కుంబ్లే 953 అంతర్జాతీయ వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు అశ్విన్.
ఇక ఈ లిస్ట్ లో హర్భజన్ సింగ్ 707 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కాగా.. అశ్విన్ తన కెరీర్ లో ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం ఇది 34వ సారి కావడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకే కుప్పకూలింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 421/5 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇక అరంగేట్ర మ్యాచ్ లోనే భారీ శతకం సాధించిన యశస్వీ జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. మరి రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్న అశ్విన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ravichandran Ashwin becomes the 2nd highest wicket taker for India in International cricket.
History created by Ashwin. pic.twitter.com/fZkgefmKSq
— Johns. (@CricCrazyJohns) July 14, 2023
ఇదికూడా చదవండి: యశస్వీ సెంచరీ ఇన్నింగ్స్.. ఎవరికి అంకితం చేశాడో తెలుసా?