Asian Games 2023: BREAKING: ఆసియన్‌ గేమ్స్‌లో ఇండియన్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌కు స్వర్ణపతకం

BREAKING: ఆసియన్‌ గేమ్స్‌లో ఇండియన్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌కు స్వర్ణపతకం

ఇండియన్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ చరిత్ర సృష్టించింది. ఆసియన్ గేమ్స్‌లో తొలిసారి గోల్డ్‌ మెడల్‌ గెలిచింది. సోమవారం శ్రీలంకతో జరిగిన ఉమెన్స్‌ క్రికెట్‌ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత జట్టు.. 19 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ కొట్టి.. స్వర్ణపతకం కైవసం చేసుకుంది. ఈ గోల్డ్‌ మెడల్‌తో ఇండియా ఖాతాలో రెండో గోల్డ్‌ వచ్చి చేరింది. ఇప్పటివరకు ఆసియా క్రీడల్లో భారత్‌ మొత్తం 11 పతకాలను గెలుచుకుంది. అయితే.. ఉమెన్స్‌ క్రికెట్‌లో ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ రావడంపై ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక మెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ కూడా గోల్డ్‌ మెడల్‌ కొట్టాలని కోరుకుంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 116 ర‌న్స్ చేసింది. స్టార్‌ ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌ అయిన స్మృతి మంధానా 46 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అలాగే జెమిమా రోడ్రిగ్స్ 42 ర‌న్స్ చేసి రాణించింది. కేవలం 117 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన మ్యాచ్‌ గెలిచి, స్వర్ణ గెలుస్తుందని చాలా మంది భావించారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇండియన్‌ బౌలర్లు చెలరేగిపోయారు. లంక మ‌హిళ‌ల జ‌ట్టును 97 పరుగులకు మాత్రమే కట్టడి చేశాడు. మొత్తంగా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 97 ర‌న్స్ చేసిన లంక జట్టు 19 ర‌న్స్ తేడాతో ఓటమి పాలై.. సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకుంది. భార‌త బౌల‌ర్ టిటాస్ సాధు 4 ఓవ‌ర్లలో కేవలం ఆరు ర‌న్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకుని.. ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. మ‌రో బౌల‌ర్ రాజేశ్వ‌రీ గౌక్వాడ్ రెండు వికెట్లతో రాణించింది. మరి ఆసియన్‌ గేమ్స్‌లో టీమిండియా గోల్డ్‌ మెడల్‌ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఇండోర్‌ నుంచి ఔట్‌డోర్‌కు! KL రాహుల్‌ కొడితే ఇలా ఉంటుంది

Show comments