వరదల్లో చిక్కుకున్న భారత మహిళ క్రికెటర్‌ రాధ యాదవ్‌! కాపాడిన NDRF

Radha Yadav, Gujarat Floods, Vadodara: ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ వరదల్లో చిక్కుకున్నారు. తాను ఎలాంటి దారుణ పరిస్థితుల్లో ఉన్నానానో తెలిపే వీడియోను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Radha Yadav, Gujarat Floods, Vadodara: ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ వరదల్లో చిక్కుకున్నారు. తాను ఎలాంటి దారుణ పరిస్థితుల్లో ఉన్నానానో తెలిపే వీడియోను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గుజరాత్‌లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఆ రాష్ట్రంలోని చాలా నగరాలను వరదలు అతలా కుతలం చేస్తున్నాయి. వడోదరాలో వర్షం ఆగినా.. వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. విశ్వామిత్రి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. చాలా ఏరియాలు నీట మునిగాయి. ఈ వరదల్లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రాధా యాదవ్‌ కూడా కూడా చిక్కుకుంది. మేము చాలా బ్యాడ్‌ కండీషన్‌లో చిక్కుకున్నామని, తమను రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌(నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌)కు ధన్యవాదాలు అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది. దానికి ఒక వీడియోను కూడా జత చేసింది రాధా యాదవ్‌.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది.. వరదల్లో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలను వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది రాధా యాదవ్‌. భారత మహిళా క్రికెట్‌ జట్టులో స్టార్‌ స్పిన్నర్‌గా ఉన్న రాధా యాదవ్‌.. ఎన్నో మంచి మంచి ప్రదర్శనలతో టీమ్‌లో కీ ప్లేయర్‌గా మారింది. అక్టోబర్‌ 3 నుంచి యూఏఈ వేదికగా జరగబోయే ఉమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో కూడా రాధా యాదవ్‌ ఆడనుంది. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఇటీవలె బీసీసీఐ ప్రకటించిన స్క్వౌడ్‌లో రాధాకు కూడా చోటు దక్కింది.

గుజరాత్‌లో భారీ వరదలు..
భారీ వర్షాలతో గుజరాత్‌ రాష్ట్రం అల్లకల్లోలంగా మరింది. వరదల కారణంగా మరో 19 మంది మరణించారు. మొత్తంగా మూడు రోజుల్లోనే 26 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం వరుసగా నాల్గవ రోజు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 17,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మోర్బి జిల్లా హల్వాద్ తాలూకా పరిధిలోని ధావానా గ్రామం సమీపంలో వరదను ట్రాక్టర్‌లో దాటుతుండగా.. వరద ఉధృతికి ట్రాక్టర్‌ కొట్టుకొపోయింది. అందులో ప్రయాణిస్తున్నవారు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను కనుగొన్నట్లు అధికారులు వెల్లడించాడు. ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న గుజరాత్‌ రాష్ట్రంలో.. ఓ భారత క్రికెటర్‌ సైతం వరదల్లో చిక్కుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments