iDreamPost
android-app
ios-app

పరువు నిలవాలంటే.. గెలవాల్సిందే! మూడో టీ20 ఆడే భారత జట్టు ఇదే

  • Published Aug 08, 2023 | 8:08 AM Updated Updated Aug 08, 2023 | 8:08 AM
  • Published Aug 08, 2023 | 8:08 AMUpdated Aug 08, 2023 | 8:08 AM
పరువు నిలవాలంటే.. గెలవాల్సిందే! మూడో టీ20 ఆడే భారత జట్టు ఇదే

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ఆడుతున్న టీమిండియాకు చావోరేవో పరిస్థితి ఎదురైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా మూడో మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌ సజీవంగా ఉండేది. లేదంటే.. సిరీస్‌ వెస్టిండీస్‌ వశం అవుతుంది. తొలి రెండు టీ20లు ఓడినా.. టీమిండియా మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచి.. సిరీస్‌ గెలుస్తుందని ఇప్పటికీ భారత క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. కాగా, వరుస ఓటములపై మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వన్డే వరల్డ్‌ కప్‌కు క్వాలిఫై కాలేకపోయిన జట్టుపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడితే ఎలాగంటూ మండిపడ్డారు.

ముఖ్యంగా టీమిండియా టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై క్రికెట్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో మూడో మ్యాచ్‌కు పాండ్యా గట్టి ప్రణాళికతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. మంగళవారం జరిగనున్న మూడో టీ20లో విజయం సాధించి, పరువు నిలుపుకోవడంతో పాటు.. సిరీస్‌ను సజీవంగా ఉంచాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఇప్పటికే టీమ్‌ సభ్యులందరికీ గట్టిగా చెప్పినట్లు సమాచారం. యువ టీమిండియా సైతం ఈ విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వన్డే సిరీస్‌లో కూడా రెండో ఓటమి తర్వాత విమర్శలు ఎదుర్కొన్న యువ భారత జట్టు.. మూడో వన్డేలో సింహ గర్జన చేసింది. ఇప్పుడు కూడా అదే సీన్‌ రిపీట్‌ చేయాలని చూస్తోంది.

అయితే.. మూడో మ్యాచ్‌ కోసం పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అతని స్థానంలో యువ బ్యాటర్‌, టెస్టుల్లో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్‌ తన తొలి టీ20 మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. ఒకవేళ ఇషాన్‌ను కొనసాగిస్తే.. సంజు శాంసన్‌ను పక్కన పెట్టే ఆలోచనలో పాండ్యా ఉన్నట్లు సమాచారం. ఇషాన్‌, సంజు ఇద్దరిలో ఒక్కరుంటే కీపర్‌ ఉన్నట్లే. ఇక స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ముఖేష్‌ కుమార్‌ స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌ను ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి.

భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా)
యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌.

ఇదీ చదవండి: అమెరికా వీధుల్లో జడేజా సూపర్ డాన్స్.. వీడియో వైరల్!