iDreamPost
android-app
ios-app

IPL వల్ల విలువ కోల్పోతున్న ఇండియన్ క్రికెటర్స్! KL రాహుల్ ఘటనే ఉదాహరణ!

  • Published May 09, 2024 | 12:28 PMUpdated May 09, 2024 | 12:28 PM

KL Rahul, Sanjiv Goenka, IPL 2024: ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ లక్నో మ్యాచ్‌ తర్వాత లక్నో ఓనర్‌ కేఎల్‌ రాహుల్‌తో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి కారణం.. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటమే అనే వాదన వినిపిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

KL Rahul, Sanjiv Goenka, IPL 2024: ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ లక్నో మ్యాచ్‌ తర్వాత లక్నో ఓనర్‌ కేఎల్‌ రాహుల్‌తో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి కారణం.. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటమే అనే వాదన వినిపిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 09, 2024 | 12:28 PMUpdated May 09, 2024 | 12:28 PM
IPL వల్ల విలువ కోల్పోతున్న ఇండియన్ క్రికెటర్స్! KL రాహుల్ ఘటనే ఉదాహరణ!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ తర్వాత లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో ఆ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా రూడ్‌గా మాట్లాడుతున్న ఘటన వివాదాస్పదంగా మారింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత గ్రౌండ్‌లోనే రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు లక్నో ఓనర్‌. ఈ ఘటనపై క్రికెట్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఓనర్‌ అయితే మాత్రం.. ఒక జట్టు కెప్టెన్‌పై, టీమిండియా ఆటగాడితో అలానేనా ప్రవర్తించేది అంటూ మండిపడుతున్నారు. టీమ్‌లో ఏమైనా లోపాలు ఉంటే.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాట్లాడుకోవాలని ఇలా గ్రౌండ్‌లో వందల కెమరాలా ముందు చీప్‌గా బిహేవ్‌ చేస్తారా అంటూ ఫైర్‌ అవుతున్నారు.

టీమిండియా ఆటగాళ్లకు ఎందుకీ దుస్థితి?
కేఎల్‌ రాహుల్‌ ఒక్కడి విషయంలోనే కాదు.. టీమిండియా ఆటగాళ్లలో చాలా మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. క్రికెటర్లు డబ్బు కోసమే ఐపీఎల్‌ ఆడుతున్నారన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌తో కొత్తగా ప్రూవ్‌ చేసుకోవాల్సిన పనిలేదు, ఐపీఎల్‌ ప్రదర్శన వారి ప్రతిభకు కొలమానం కాదు. కేవలం డబ్బు కోసమే ఐపీఎల్ నడుస్తోంది. ఆటగాళ్లపై వంద కోట్ల పెట్టుబడి పెట్టి.. సంజీవ్‌ గోయెంకా లాంటి వ్యాపారవేత్తలు దీన్ని కేవలం బిజినెస్‌గానే చూస్తున్నారు. ఇందులో క్రికెట్‌ కాకుండా.. వారి డబ్బు, వ్యక్తిగత పేరు, ప్రతిష్టలను చూస్తున్నారు. మ్యాచ్‌ గెలిస్తే తమ పరువు పెరిగినట్లు, మ్యాచ్‌ ఓడితే తమ పరువు పోయినట్లు వ్యక్తిగత ప్రతిష్టగా భావిస్తున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

ఇదే ఆటగాళ్లు టీమిండియా తరఫున ఆడినప్పుడు కూడా.. కొన్నిసార్లు విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. అభిమానులు వారిని తిట్టడం, వారి ఫొటోలను కాల్చడం చేస్తూ ఉంటారు. అందులో వ్యక్తగత ప్రతిష్ట, వ్యక్తిగత ద్వేషం కంటే.. దేశంపై అభిమానమే కనిపిస్తుంది. కానీ, ఐపీఎల్‌ అనేది ఒక ఎంటరైన్‌మెంట్‌ లీగ్‌, ఫ్రాంచైజ్‌ క్రికెట్‌. ఇలాంటి లీగ్‌లో ఆటగాళ్లు క్రికెట్‌ గురించి ముక్క కూడా తెలియని డబ్బు ఉన్న వారి మాటలు పడుతున్నారు. ఇందతా కేవలం వాళ్లు డబ్బులిచ్చి ఆడించడం వల్లే జరుగుతోంది. అయినా.. టీమిండియాకు మాత్రమే ఆడుతూ.. వారికొచ్చే స్టార్‌ డమ్‌తో యాడ్స్‌ అవి ఇవి చేసుకుంటూ ఆటగాళ్లు బాగా సంపాదించవచ్చు. ఎక్కువ డబ్బు కోసం ఐపీఎల్‌ ఆడుతూ.. తమను కొనుగోలు చేసిన వారి మాటల పడుతూ, విలువ కోల్పోతున్నారని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి కేఎల్‌ రాహుల్‌ విషయంలో జరిగిన దానికి టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటమే కారణం అని వస్తున్న వాదనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి