దేశం మొత్తం దసరా పండుగ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. ఒక స్టార్ క్రికెటర్ కూడా దసరా ఫెస్టివల్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అందరి కంటే డిఫరెంట్‌గా అతను పండుగను జరుపుకున్నాడు. ఎవరా క్రికెటర్? అతనేం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశం మొత్తం దసరా పండుగ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. ఒక స్టార్ క్రికెటర్ కూడా దసరా ఫెస్టివల్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అందరి కంటే డిఫరెంట్‌గా అతను పండుగను జరుపుకున్నాడు. ఎవరా క్రికెటర్? అతనేం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా దసరా పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు శమి పూజ, అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆనందోత్సాహాల నడుమ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. జమ్మి చెట్టుకు పూజ చేయడంతో పాటు వెహికిల్స్‌కు, యంత్రాలు, పనిముట్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఒకర్నొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక స్టార్ క్రికెటర్ కూడా దసరా పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అతడే టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్.
రిషబ్ పంత్.. టీమిండియా స్టార్ క్రికెటర్లలో ఒకడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు వికెట్ల వెనుక కీపింగ్‌తోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతడి ఆటతీరు సూపర్బ్ అనే చెప్పాలి. వీరేంద్ర సెహ్వాగ్ మాదిరిగా లాంగ్ ఫార్మాట్లో అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థులను భయపెడతాడు పంత్. మ్యాచ్ కండీషన్స్ ఎలా ఉన్నా దూకుడే మంత్రంగా అతడి బ్యాటింగ్ ఉంటుంది. దీనికి టీమ్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇవ్వడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. టెస్టుల్లో తన ప్లేస్‌ను పర్మినెంట్ చేసుకున్న పంత్.. క్రమక్రమంగా వన్డేలు, టీ20ల్లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకోవడంపై ఫోకస్ చేశాడు. అయితే కెరీర్ పీక్ టైమ్‌లో ఉండగానే రిషబ్ పంత్‌కు అనూహ్యంగా భారీ యాక్సిడెంట్ అయింది.
కారులో వేగంగా డ్రైవ్ చేస్తున్న పంత్ వెహికిల్ కంట్రోల్ కాకపోవడంతో రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. భారీ గాయాలపాలైన పంత్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంజ్యురీ నుంచి కోలుకున్న ఈ లెఫ్టాండర్.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫిట్నెస్ను ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు బ్యాటింగ్, కీపింగ్ టెక్నిక్స్‌ను మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఈ స్టార్ క్రికెటర్ తన బ్యాట్‌తో పాటు క్రికెట్ కిట్‌ను అమ్మవారి ఫొటోల దగ్గర ఉంచి పూజ చేశాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పంత్.. ఆయుధ పూజ చేశానని తెలిపాడు. ఈ ఫొటో చూసిన నెటిజన్స్.. ఆయుధ పూజ ముగిసింది, త్వరలో కమ్‌బ్యాక్ చేసి బ్యాట్ పవర్ చూపించు పంత్ అంటూ అతడ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి.. పంత్ ఆయుధ పూజపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆ విషయంలో రోహిత్-కోహ్లీ మధ్య వాదన! ఏకంగా గ్రౌండ్‌లోనే..!
Rishabh Pant celebrating Ayutha Pooja. pic.twitter.com/pF3ujiJMHn
— Johns. (@CricCrazyJohns) October 23, 2023