IPL.. ఎంతో మంది టాలెంటెడ్ ఆటగాళ్లను క్రికెట్ కు పరిచయం చేసింది. మరీ ముఖ్యంగా టీమిండియా యంగ్ స్టర్స్ కు ఈ వేదిక భారత జట్టులోకి రావడానికి ఒక వారధిగా పనిచేసింది. ఇప్పటి వరకు ఎంతో మంది టాలెంటెడ్ ఆటగాళ్లను ఈ టోర్నీ వెలుగులోకి తీసుకొచ్చింది. అలా ఐపీఎల్ సీజన్-4తో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు క్రికెటర్ పాల్ వాల్తాటి. 2011లోనే ఐపీఎల్ లో సెంచరీ బాది రికార్డు సృష్టించాడు వాల్తాటి. తాజాగా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.
పాల్ వాల్తాటి.. ఐపీఎల్ 4లో చెన్నై సూపర్ కింగ్స్ పై సెంచరీ బాది ఒక్కసారిగా మార్మోగిపోయాడు. 2011 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగాడు వాల్తాటి. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 63 బంతుల్లోనే 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వాల్తాటి మెుత్తం 23 మ్యాచ్ ల్లో 505 పరుగులు చేశాడు. అయితే అనూహ్యంగా ఆ తరువాత క్రికెట్ నుంచి కనుమరుగైపోయాడు. కాగా.. 2002 అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా అతడి కంటికి గాయం అయ్యింది. దాంతో పాక్షికంగా అతడి కంటి చూపు కోల్పోయాడు. అయినప్పటికీ ఆటపై ప్రేమతో తన ఆటను కొనసాగించాడు. తన కెరీర్ లో కేవలం 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, లిస్ట్ -ఏ క్రికెట్ లో కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఈక్రమంలోనే తాజాగా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.
Paul Valthaty has announced his retirement from first class cricket. pic.twitter.com/bpx6i95MyO
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 17, 2023
ఇదికూడా చదవండి: వీడియో: డుప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్.. లేటు వయసులో కళ్లు చెదిరే ఫీల్డింగ్!