Dharani
వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓటమిని తట్టుకోలేక తిరుపతికి చెందిన ఐటీ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందగా.. మరో వార్త వెలుగు చూసింది. ఇండియన్ క్రికెటర్ షమీ తల్లి ఆస్పత్రిలో చేరారు. ఆ వివరాలు
వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓటమిని తట్టుకోలేక తిరుపతికి చెందిన ఐటీ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందగా.. మరో వార్త వెలుగు చూసింది. ఇండియన్ క్రికెటర్ షమీ తల్లి ఆస్పత్రిలో చేరారు. ఆ వివరాలు
Dharani
ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలయ్యింది. కప్పు గెలిచి తీరతామనే నమ్మకంతో క్రీజులోకి దిగిన టీమిండియా.. ఎంత శ్రమించినప్పటికి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఇక ఇండియా ఓడిపోవడాన్ని తట్టుకోలేక తిరుపతికి చెందిన ఐటీ ఉద్యోగి ఒకరు గుండెపోటుతో కన్నుమూశారు. ఈ క్రమంలో తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. భారత పేసర్ మహ్మద్ షమీ తల్లి అంజుమ్ అరా ఆస్పత్రి పాలయ్యారు. ఆదివారం మధ్యాహ్నం భారత్, ఆస్ట్రేలియా మధ్య వర్డల్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
అంజుమ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫైనల్ మ్యాచ్ రోజున అప్పటికే జ్వరంతో బాధపడుతున్న ఆమె.. తీవ్ర బలహీనతకు గురయ్యారు. అంజుమ్ జ్వరం, ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తొలుత స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆమెను హై సెంటర్‌కు తరలించారని షమీ బంధువు ఒకరు తెలిపారు.
ప్రస్తుతం అజుమ్ పరిస్థితి నిలకడానే ఉందని.. త్వరలోనే కోలుకుంటుందని చెప్పుకొచ్చారు. ఫైనల్ మ్యాచ్‌కు ఒకరోజు ముందు అంజుమ్ మీడియాతో మాట్లాడారు. భారత జట్టు తుది మ్యాచ్‌లో విజయం సాధించి కప్పు గెలవాలని ఆకాంక్షించారు. అంతేకాక తన కుమారుడు షమీ దేశం గర్వపడేలా చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో షమీ తల్లి.. ఆమె కొడుకుతో పాటు.. టీమిండియా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన ఆమె.. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫైనల్ మ్యాచ్ చూడటం కోసం షమీ కుటుంబ సభ్యులు నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లాలని అనుకున్నారు. కానీ అంజుమ్ అనారోగ్యం పాలవ్వడంతో.. వారు ఆ ఆలోచన విరమించుకున్నారు. షమీ పెద్దన్నయ్య హసీబ్ ఒక్కడు మాత్రమే మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లారు
ఫైనల్ మ్యాచ్ సందర్భంగా షమీ స్వస్థలం యూపీలోని సహస్‌పూర్‌లో కోలాహలం కనిపించింది. పైగా వరల్డ్ కప్ సెమిస్‌లో షమీ ఏడు వికెట్లతో సత్తా చాటడంతోపాటు.. మిగతా మ్యాచ్‌ల్లోనూ తను అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ రికార్డు నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ షమీ సొంతూరిలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఆరోసారి కప్‌ను సొంతం చేసుకుంది.