SNP
KL Rahul, World Cup 2023: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బర్త్‌డే రోజే తిట్లు తింటున్నాడు. ఎందుకు అతనేం చేశాడని కంగారు పడకండి.. ఫ్యాన్స్ అతన్ని ఎందుకు తిడుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.
KL Rahul, World Cup 2023: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బర్త్‌డే రోజే తిట్లు తింటున్నాడు. ఎందుకు అతనేం చేశాడని కంగారు పడకండి.. ఫ్యాన్స్ అతన్ని ఎందుకు తిడుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.
SNP
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తన పుట్టిన రోజు నాడే క్రికెట్ అభిమానులతో తిట్లు తింటున్నాడు. ఈ రోజు అంటే ఏప్రిల్ 18 కేఎల్ రాహుల్ బర్త్‌డే. 1992 ఏప్రిల్ 18న రాహుల్ జన్మించాడు. అయితే.. ఇక్కడ సమస్య రాహుల్ బర్త్‌డే గురించి కాదు. తాజాగా అతను చేసిన కామెంట్స్ అభిమానుల కోపానికి కారణమైంది. ఇంకీ రాహుల్ ఏం అన్నాడు? ఫ్యాన్స్ ఎందుకు అతన్ని తిడుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. కేఎల్ రాహుల్, మరో టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూకి వచ్చిన రాహుల్‌ను అశ్విన్ ఒక ప్రశ్న అడిగాడు. నీకు టైమ్ మెషీన్ ఇచ్చి, ఒక పనిని, లేదా నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వస్తే ఏం మార్చకుంటాం కాలంలో వెనక్కి వెళ్లి? అని అశ్విన్ అడగ్గా..
రాహుల్ బదులిస్తూ.. ‘నేను వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ టైమ్‌కి వెళ్తాను. ఆ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్‌పై ఎదురుదాడికి దిగాలా? లేక చూసి ఆడాలా? అనే అయోమయంలో నేను నా వికెట్ పారేసుకున్నాను. నేను చివరి వరకు ఆడి ఉంటే.. ఇంకో 30 ప్లస్ రన్స్ వచ్చి ఉండేవి. దాంతో వన్డే వరల్డ్ కప్ మన చేతుల్లో ఉండేది. అదే నా జీవితంలో పెద్ద రిగ్రేట్. దాన్ని నేను మార్చుకోవాలని అనుకుంటున్నాను’ అని రాహుల్ పేర్కొన్నాడు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రాహుల్ చెప్పిన దాంట్లో తప్పేముందని చాలా మందికి అనిపించి ఉండొచ్చు. కానీ, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గాయాన్ని పొందిన క్రికెట్ అభిమానులు మాత్రం రాహుల్‌ని బండబూతులు తిడుతున్నారు. వారికి కోపానికి కారణం ఏంటంటే..
ఫైనల్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 4 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 54 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 4, జడేజా 9, సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. కేఎల్ రాహుల్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ, చాలా స్లోగా ఆడాడు. 107 బంతుల్లో 66 రన్స్ చేశాడు. టెస్ట్ ఇన్నింగ్స్‌ను తలపించాడు. చాలా డాట్ బాల్స్ ఆడాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌తో టీమిండియాకు నష్టమే కానీ, లాభం లేదని, కేవలం 30 పరుగుల తేడాతో ఆ మ్యాచ్ ఇండియా గెలిచేదా? మనం పెట్టిన 241 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా 43 ఓవర్లలోనే కొట్టేసింది.. అలాంటిది తాను చివరి వరకు ఆడి ఉంటే మరో 30 పరుగులు అదనంగా వచ్చేవి, వరల్డ్ కప్ మన చేతుల్లో ఉండేదంటూ కేఎల్ రాహుల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ashwin – “If I could give an opportunity to give a time machine & review one decision to correct it all over again, what will it be”? [Ashwin YT]
KL Rahul said “The World Cup final against Australia, I was stuck in the moment, whether to take down Starc or just play him as it… pic.twitter.com/IHnlSMNh2l
— Johns. (@CricCrazyJohns) April 18, 2024