iDreamPost
android-app
ios-app

ఊతప్ప, సింగ్ ల విధ్వంసం.. వెస్టిండీస్ ఛాంపియన్స్ ను చిత్తు!

  • Published Jul 06, 2024 | 10:29 AM Updated Updated Jul 06, 2024 | 10:29 AM

World Championship of Legends 2024: ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో ఇండియన్ లెజెండ్స్ తమ జోరును కొనసాగిస్తున్నారు. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

World Championship of Legends 2024: ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో ఇండియన్ లెజెండ్స్ తమ జోరును కొనసాగిస్తున్నారు. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఊతప్ప, సింగ్ ల విధ్వంసం.. వెస్టిండీస్ ఛాంపియన్స్ ను చిత్తు!

వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2024లో టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ ఛాంపియన్స్ ను 3 వికెట్ల తేడాతో ఓడించిన ఇండియన్ ఛాంపియన్స్.. అదే జోరును వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కూడా చూపించింది. వరుణుడు అడ్డుపడ్డ ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 27 రన్స్ తేడాతో ఇండియన్ ఛాంపియన్స్ విజయం సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో రాబిన్ ఊతప్ప, గుర్ కీరత్ సింగ్ మాన్ తుఫాన్ బ్యాటింగ్ తో విండీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దాంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో ఇండియన్ లెజెండ్స్ తమ జోరును కొనసాగిస్తున్నారు. తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ ఛాంపియన్స్ కు షాకిచ్చిన ఇండియన్ లెజెండ్స్.. రెండో మ్యాచ్ లో విండీస్ ఛాంపియన్స్ ను ఓడించారు. డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ భారత ఛాంపియన్స్ కు సారథ్యం వహిస్తున్నాడు. బర్మింగ్ హామ్ వేదికగా వెస్టిండీస్ ఛాంపియన్స్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఇండియన్ ఛాంపియన్స్ ఇంత స్కోర్ చేయడానికి ప్రధాన కారణం రాబిన్ ఊతప్ప, గుర్ కీరత్ సింగ్ మాన్ లే. వీరిద్దరు విండీస్ బౌలర్లను దంచికొడుతూ.. స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. మరీ ముఖ్యంగా ఓపెనర్ ఊతప్ప పెను విధ్వంసం సృష్టించాడు. తొలి ఓవర్లోనే నమన్ ఓజా(0) డకౌట్ గా వెనుదిరిగినా.. ఊతప్ప రెచ్చిపోయి ఆడాడు. కరేబియన్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కేవలం 17 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగుల థండర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఊతప్ప పెవిలియన్ చేరిన తర్వాత గుర్ కీరత్ సింగ్ సూపర్ నాక్ తో అదరగొట్టాడు.

ఊతప్ప వేగాన్ని కొనసాగిస్తూ.. ప్రత్యర్థిపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు సింగ్. దాంతో స్కోర్ పరుగులు పెట్టింది. సింగ్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 86 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఇక కెప్టెన్ యువరాజ్ సింగ్ 38 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. మిగతా వారిలో రైనా(19) రన్స్ చేశాడు. అనంతరం 230 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ ఛాంపియన్స్ కు వరుణుడు అడ్డుతగిలాడు. 5.3 ఓవర్లకు విండీస్ స్కోర్ 31/1 దగ్గర ఉండగా.. వర్షం ప్రారంభం అయ్యింది. వాన ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 27 పరుగుల తేడాతో ఇండియన్ ఛాంపియన్స్ మ్యాచ్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఈ లీగ్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు ఇండియన్ లెజెండ్స్. ఇక తన తర్వాతి మ్యాచ్ ను దాయాది దేశమైన పాకిస్తాన్ ఛాంపియన్స్ తో నేడు(జూలై 6, శనివారం) ఆడనుంది.