Abhishek Sharma: ఆ లెజెండ్ కోసం నెక్స్ట్ వరల్డ్ కప్ గెలుస్తాం.. అభిషేక్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకోవడంతో మొత్తం భారతావని సంతోషంలో మునిగిపోయింది. ప్రపంచ కప్ సంబురాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిన్ననే ముంబైలో విక్టరీ పరేడ్ ఘనంగా జరిగింది.

టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకోవడంతో మొత్తం భారతావని సంతోషంలో మునిగిపోయింది. ప్రపంచ కప్ సంబురాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిన్ననే ముంబైలో విక్టరీ పరేడ్ ఘనంగా జరిగింది.

టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకోవడంతో మొత్తం భారతావని సంతోషంలో మునిగిపోయింది. ప్రపంచ కప్ సంబురాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిన్ననే ముంబైలో విక్టరీ పరేడ్ ఘనంగా నిర్వహించారు. కరీబియన్ దీవుల నుంచి స్వదేశానికి చేరుకున్న రోహిత్ సేనకు అపూర్వ స్వాగతం లభించింది. కప్పుతో తిరిగొచ్చిన మెన్ ఇన్ బ్లూను అభిమానులు అక్కున చేర్చుకున్నారు. వరల్డ్ కప్ హీరోస్​కు గ్రాండ్​ వెల్​కమ్ చెప్పారు. ఎయిర్​పోర్ట్ నుంచి వాంఖడే స్టేడియానికి ఓపెన్ బస్​లో వచ్చిన భారత జట్టుకు లక్షలాది మంది అభిమానులు చప్పట్లతో స్వాగతం పలికారు. వాళ్లకు అభినందనలు తెలిపారు. ట్రోఫీతో తిరిగొచ్చినందుకు గర్వపడుతున్నామని చెప్పారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ కప్ మీదే అంటూ ఫ్యాన్స్​కు కృతజ్ఞతలు చెప్పారు.

వాంఖడే స్టేడియంలో కప్పుతో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా ఆటగాళ్లు.. ఆ తర్వాత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కెప్టెన్ రోహిత్, టాప్ బ్యాటర్ కోహ్లీ విక్టరీ స్పీచ్​ ఇచ్చారు. ఆ తర్వాత కప్పు చేతబట్టి స్టేడియం మొత్తం కలియదిరిగారు. ఈ క్రమంలో డీజే ప్లే చేసిన పలు దేశభక్తి గీతాలకు తమ గొంతును కలిపారు. అలాగే ఢోల్ శబ్దానికి తగ్గట్లు స్టెప్స్ వేస్తూ స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశారు. ఈ సెలబ్రేషన్స్ ఒకవైపు కొనసాగుతున్న సమయంలోనే మరోవైపు పలువురు ప్రముఖులు రోహిత్ సేనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కోట్లాది మందిని ఇన్​స్పైర్ చేశారంటూ మెచ్చుకుంటున్నారు. టీమిండియా విజయంపై యంగ్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ, ధృవ్ జురెల్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే విక్టరీ అని అభిషేక్ అన్నాడు. ఈ గెలుపు చూసి లెజెండ్ యువరాజ్ సింగ్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడని తెలిపాడు.

‘భారత్ టీ20 వరల్డ్ కప్​ను నెగ్గిన సమయంలో యువరాజ్ సింగ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన నుంచి నేను స్ఫూర్తి పొందా. యువీలాగే నేను కూడా ఇండియా కోసం ప్రపంచ కప్ గెలవాలని అనుకుంటున్నా’ అని అభిషేక్ చెప్పాడు. దేశం కోసం అలాగే యువీ కోసం మెగాట్రోఫీని నెగ్గాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున విధ్వంసక ఇన్నింగ్స్​లు ఆడిన ఈ ఓపెనర్​ను జింబాబ్వే సిరీస్​కు ఎంపిక చేశారు. అతడికి యువీ గురువు అనేది తెలిసిందే. అందుకే గురువు నుంచి ఇన్​స్పైర్ అయ్యానని.. కప్ గెలుస్తానని అన్నాడు అభిషేక్. ఇక, జింబాబ్వే సిరీస్​కు ఎంపికైన కీపర్ జురెల్ మాట్లాడుతూ.. వరల్డ్ కప్ ఫైనల్​లో ఒకదశలో భారత్ ఓటమి దిశగా సాగడంతో తాను సౌతాఫ్రికాకు మద్దతు ఇచ్చానని, ఆఖరి వరకు అదే టీమ్​కు సపోర్ట్ చేశానన్నాడు. అయితే చివర్లో రోహిత్ సేనే ఛాంపియన్​గా నిలిచిందన్నాడు.

Show comments