రాసిపెట్టుకోండి.. టీమిండియాదే వరల్డ్‌ కప్‌! ఇదే సాక్ష్యం

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ప్రారంభానికి మరో రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే క్రికెట్‌ వర్గాల్లో వరల్డ్‌ కప్‌ గురించి చర్చ జరుగుతుంది. అలాగే పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఏ జట్టుకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఏ టీమ్స్‌ హాట్‌ ఫేవరేట్‌? సెమీస్‌ వరకు ఎవరు వెళ్తారు? అనే విషయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటంతో అప్పుడే.. వరల్డ్‌ కప్‌ ఫీవర్‌ వచ్చేసినట్లు కనిపిస్తోంది. పైగా తాజాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్‌ ట్రోఫీతో దిగిన ఫొటో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. దాంతో వరల్డ్‌ కప్‌ ఎవరు గెలుస్తారనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీమిండియా కప్పు గెలుస్తుందా? లేదా? అనే విషయం ప్రతి చోట చర్చకు వస్తోంది.

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రోహిత్‌ శర్మ అద్భుత కెప్టెన్‌ అయినప్పటికీ టీమ్‌ కూడా బాగుండాలని అప్పుడు టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలుస్తుందని, ఇప్పుడున్న జట్టుపై తనకు అంత నమ్మకం లేదన్నట్లు పరోక్షంగా చెప్పాడు. అలాగే ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ తన నాలుగు ఫేవరేట్‌ జట్లను ప్రకటించాడు. అందులో ఇండియా, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఉన్నాయి. అయితే ఈ నాలుగింటిలో పాకిస్థాన్‌కే ఎక్కువ అవకాశం ఉందని అన్నాడు. ఇలా పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జట్టులో ఆటగాళ్లు గత రికార్డులు ఇవన్నీ పక్కనపెడితే.. ఒక్క విషయం మాత్రం టీమిండియాకు చాలా అనుకూలంగా ఉంది.

అదేంటే.. భారత్‌ 2011లో ధోని కెప్టెన్సీలో వరల్డ్‌ కప్‌ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత.. 2015లో జరిగిన వరల్డ్‌ కప్‌ను ఆస్ట్రేలియా గెలిచింది, అలాగే 2019 వరల్డ్‌ కప్‌ను ఇంగ్లండ్‌ ఎగరేసుకుపోయింది. అయితే.. ఈ మూడు వరల్డ్‌ కప్పుల్లో విజేతలు వేరైనా.. ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. అదేంటంటే.. మూడు వరల్డ్‌ కప్‌ను అతిథ్య జట్టే గెలిచింది. 2011 వరల్డ్‌ కప్‌ భారత్‌లో జరిగింది టీమిండియా గెలిచింది. అలాగే 2015లో ఆస్ట్రేలియాలో జరిగితే.. ఆస్ట్రేలియా గెలిచింది. 2019 వరల్డ్‌ కప్‌ ఇంగ్లండ్‌లో జరిగితే.. ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. ఈ సెంటిమెంట్‌ని బట్టి ఇప్పుడు 2023 వన్డే వరల్డ్‌ కప్‌ మనదేశంలోనే జరుగుతున్న నేపథ్యంలో టీమిండియానే విజేతగా నిలుస్తుందని క్రికెట్‌ అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్‌ వర్క్‌అవుట్‌ అయితే.. భారత్‌దే వరల్డ్‌ కప్‌. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్‌ బౌలర్లపై రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు! పెద్ద కాంట్రవర్సీ అవుతుందంటూ..

Show comments