SNP
సెమీస్‌లో మోస్ట్ డేంజర్ టీమ్ న్యూజిలాండ్‌తోనే భారత్ తలపడే అవకాశం ఉంది. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఆ జట్టు దాదాపుగా సెమీస్ చేరినట్లే.
సెమీస్‌లో మోస్ట్ డేంజర్ టీమ్ న్యూజిలాండ్‌తోనే భారత్ తలపడే అవకాశం ఉంది. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఆ జట్టు దాదాపుగా సెమీస్ చేరినట్లే.
SNP
వన్డే వరల్డ్ కప్ 2023 సమీ ఫైనల్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరనే సస్పెన్స్‌కు దాదాపు తెరపడింది. సెమీస్‌లో మోస్ట్ డేంజర్ టీమ్ న్యూజిలాండ్‌తోనే భారత్ తలపడే అవకాశం ఉంది. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఆ జట్టు దాదాపుగా సెమీస్ చేరినట్లే. కానీ, అధికారికంగా తేలాలంటే.. పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్, ఆఫ్ఘానిస్థాన్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌లు పూర్తి అయ్యేంత వరకు ఆగాలి. ఎందుకంటే.. ఆ జట్లకు కూడా సెమీస్ చేరేందుకు కొన్ని సమీకరణాలు అనుకూలించే అవకాశం ఉంది. అవి అంత ఈజీగా కాకపోయినా.. ఏదో అద్భుతంగా జరిగే పాకిస్థాన్ సెమీస్ చేరే ఛాన్స్ ఉంది. పాక్ విషయం పక్కనపెడితే.. సెమీస్‌లో మన ప్రత్యర్థి కివీస్ అనే అంతా ఫిక్స్ అయిపోయారు.
అయితే.. న్యూజిలాండ్‌పై నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియాకు అంత మంచి రికార్డు లేకపోవడం, క్రికెట్ అభిమానులను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించినా కూడా సెమీస్ అనగానే.. ఏదో తెలియని ఆందోళన నెలకొంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమిని భారత క్రికెట్ అభిమానులు ఇంకా మర్చిపోలేదు. మిస్టర్ కూల్ ధోని సైతం కన్నీళ్లు పెట్టుకున్న మ్యాచ్ అది. అలాగే 2021లో జరిగిన మొట్టమొదటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ టీమిండియాను ఓడించింది న్యూజిలాండ్. ఇలా నాకౌట్, ఫైనల్స్‌లో మనపై కివీస్ పైచేయి సాధిస్తూ వస్తోంది. కానీ, ఈ సారి మాత్రం అలాంటి సీన్స్ రిపీట్ కావని, రోహిత్ సేన ఎంతో పటిష్టంగా ఉందని, ఆ ఓటములకు టీమిండియా ఈ సారి ప్రతీకారం తీర్చుకుని ఫైనల్‌లో అడుగుపెడుతుందని చాలా మంది భారత అభిమానులు నమ్ముతున్నారు.
అయితే.. వారు అంత నమ్మకం పెంచుకోవడానికి కారణం ఒకే ఒక్కడు. అతనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఎస్.. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించాలంటే రోహిత్ శర్మ వల్లే అవుతుంది. అతను నిలబడితే కివీస్‌ను.. కివీ ఫ్రూట్‌ను నమిలి మింగేసినట్లు మింగేస్తాడు హిట్‌మ్యాన్. ఈ సారి న్యూజిలాండ్‌పై గెలుస్తామని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌లో అంత బలమైన నమ్మకం కలిగిందంటే.. అది కేవలం రోహిత్ బ్యాటింగ్ చేస్తాడనే కాదు. అంతకు మించి రోహిత్ శర్మ జట్టుతో ఏదో చేస్తున్నాడు. కెప్టెన్‌గా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లిపోయిన రోహిత్.. ప్రతి ప్రత్యర్థికి ఏదో ఒక నిర్దిష్టమైన ప్లాన్‌తో వస్తున్నాడు. టీమ్‌లో ఎప్పుడూ లేనంత జోష్ పెంచుతున్నాడు. ప్రతి ఆటగాడి సక్సెస్‌ను అందరూ ఎంజాయ్ చేసే వాతావరణాన్ని టీమ్‌లో తీసుకొచ్చాడు. అయితే.. న్యూజిలాండ్ లాంటి బలమైన ప్రత్యర్థిని ఓడించేందుకు కోహ్లీ, గిల్, అయ్యర్, రాహుల్, జడేజా, బుమ్రా, సిరాజ్, షమీ, కుల్దీప్ లాంటి హేమాహేమీలు ఉన్నా.. రోహిత్ శర్మ మాస్టర్ మైండ్ మరింత ప్లస్‌కానుంది.
సెమీస్‌లో మిగతా ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు రోహిత్ శర్మ మైండ్ పాదరసంలా కదిలితేనే టీమిండియా ఫైనల్‌కు చేరుతుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. అద్భుతమైన ప్లానింగ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ మార్పులు, సూపర్ ఫీల్డ్ సెట్ చేస్తూ.. కెప్టెన్‌గా అందరి కంటే పది అడుగులు ముందు ఉంటున్నాడు రోహిత్ శర్మ. అందుకే సెమీ ఫైనల్‌లో రోహిత్ శర్మ బాగా బ్యాటింగ్ చేయడంతో పాటు.. కెప్టెన్‌గా మరింత పదునుగా నిర్ణయాలు తీసుకుంటే.. న్యూజిలాండ్‌కు ఓటమి తప్పదు. మరి సెమీ ఫైనల్‌లో టీమిండియా విజయావకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
So Semifinal 1 will be IND VS NZL⚡….. Hopefully Nov 15 revenge day…..#TeamIndia #CWC23 #Semifinal pic.twitter.com/wa6H4ehItV
— தளபதி ராம்🔥🧊 (@SethuVj007) November 9, 2023
This is Rohit Sharma for you 🔥
He never played for records or his personal milestones, he always plays his shot 💉 pic.twitter.com/fExwyP6ced
— VECTOR⁴⁵ (@Vector_45R) November 6, 2023