iDreamPost
android-app
ios-app

మూడో టీ20కి ముందు టీమిండియాలోకి ముగ్గురు మొనగాళ్లు.. జింబాబ్వేకు దబిడిదిబిడే!

  • Published Jul 08, 2024 | 4:32 PM Updated Updated Jul 08, 2024 | 4:32 PM

India vs Zimbabwe: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బంపర్ విక్టరీ కొట్టడంతో ఫుల్ జోష్​లో ఉంది టీమిండియా. తొలి మ్యాచ్​లో ఓటమి నుంచి వెంటనే తేరుకొని భారీ విజయం సాధిండంతో హ్యాపీగా ఉంది. ఈ తరుణంలో గిల్ సేనకు మరో గుడ్ న్యూస్.

India vs Zimbabwe: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బంపర్ విక్టరీ కొట్టడంతో ఫుల్ జోష్​లో ఉంది టీమిండియా. తొలి మ్యాచ్​లో ఓటమి నుంచి వెంటనే తేరుకొని భారీ విజయం సాధిండంతో హ్యాపీగా ఉంది. ఈ తరుణంలో గిల్ సేనకు మరో గుడ్ న్యూస్.

  • Published Jul 08, 2024 | 4:32 PMUpdated Jul 08, 2024 | 4:32 PM
మూడో టీ20కి ముందు టీమిండియాలోకి ముగ్గురు మొనగాళ్లు.. జింబాబ్వేకు దబిడిదిబిడే!

టీ20 వరల్డ్ కప్ సంబురాలు ముగియక ముందే మరో సిరీస్​తో బిజీ అయిపోయింది టీమిండియా. జింబాబ్వే జట్టుతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది మెన్ ఇన్ బ్లూ. ఇప్పటికే రెండు మ్యాచ్​లు ముగిసిన ఈ సిరీస్ 1-1తో సమానంగా ఉంది. పసికూన జట్టు కదా ఏం చేయగలదని జింబాబ్వేను అంతా లైట్ తీసుకున్నారు. కానీ తొలి మ్యాచ్​లో గిల్ సేనకు ఆ జట్టు షాక్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్​లో విజయం సాధించి తమను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరికలు పంపించింది జింబాబ్వే. అయితే ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న టీమిండియా.. రెండో మ్యాచ్​లో ఘన విజయం సాధించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. అభిషేక్ శర్మ (47 బంతుల్లో 100) సెంచరీతో చెలరేగి మ్యాచ్​ను వన్ సైడ్ చేశాడు. అతడితో పాటు రుతురాజ్ గైక్వాడ్ (77 నాటౌట్), రింకూ సింగ్ (48 నాటౌట్) కూడా సూపర్బ్ నాక్స్​తో సత్తా చాటారు.

బౌలింగ్​లో ఆవేశ్​ ఖాన్, ముకేశ్​ కుమార్ చెరో 3 వికెట్లతో అదరగొట్టారు. వీళ్లకు తోడు రవి బిష్ణోయ్ (2/11)కూడా రాణించడంతో జింబాబ్వే 134 పరుగులకే చాప చుట్టేసింది. సెంచరీతో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. సిరీస్​ను డ్రా చేసిన టీమిండియా.. ఇదే ఊపులో నెక్స్ట్ మ్యాచ్​లోనూ విక్టరీ కొట్టాలని చూస్తోంది. లోకల్ కండీషన్స్​కు త్వరగా అలవాటు పడిన గిల్ సేన.. ఇప్పుడు రండి చూస్కుందాం అంటూ జింబాబ్వేకు సవాల్ విసురుతోంది. రెండో మ్యాచ్​లోలాగే మూడో టీ20లోనూ చిత్తు చేస్తామని వార్నింగ్ ఇస్తోంది. ఈ తరుణంలో భారత్​కు మరో గుడ్ న్యూస్. మన టీమ్​లోకి ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు. సంజూ శాంసన్​తో పాటు యశస్వి జైస్వాల్, శివమ్ దూబె తాజాగా జట్టుతో చేరారు.

టీ20 వరల్డ్ కప్ గెలిచిన స్క్వాడ్​లో సభ్యులుగా ఉన్న సంజూ, జైస్వాల్, దూబె వెస్టిండీస్ నుంచి కాస్త ఆలస్యంగా స్వదేశానికి చేరుకున్నారు. భారత్​కు రాగానే ప్రధాని నరేంద్ర మోడీని కలవడం, ఆ తర్వాత ముంబైలో ఘనంగా నిర్వహించిన విక్టరీ పరేడ్​లో పాల్గొనడంతో వాళ్లు ఫుల్ బిజీ అయిపోయారు. విక్టరీ పరేడ్ తర్వాత సంజూ ఇంటికి వెళ్లిపోయాడు. అయితే దూబె, జైస్వాల్ మాత్రం మహారాష్ట్ర అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి సహా ఇతర నేతల్ని కలిశారు. అక్కడి విధాన సభలో ప్రసంగించారు. ఇలా పలు కార్యక్రమాలను ముగించుకొని జింబాబ్వేకు పయనమయ్యారు. తాజాగా టీమ్​తో జాయిన అయిన వీళ్లు.. మూడో టీ20కి అందుబాటులో ఉంటారు. దీంతో కీలక మ్యాచ్​లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. వీళ్ల రాకతో జట్టులో ఎవరి ప్లేస్​కు గండం ఏర్పడుతుందో చూడాలి. జైస్వాల్, దూబె, సంజూ టీమ్​లోకి వస్తే జింబాబ్వేకు దబిడిదిబిడేనని చెప్పాలి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş