iDreamPost
android-app
ios-app

IND vs ZIM: ఇండియా-జింబాబ్వే టీ20 సిరీస్‌! పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • Published Feb 06, 2024 | 4:39 PM Updated Updated Feb 06, 2024 | 5:21 PM

భారత క్రికెట్ జట్టు మరో ఆసక్తికర సిరీస్​కు రెడీ అవుతోంది. జింబాబ్వేతో తలపడనున్న ఈ సిరీస్​కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.

భారత క్రికెట్ జట్టు మరో ఆసక్తికర సిరీస్​కు రెడీ అవుతోంది. జింబాబ్వేతో తలపడనున్న ఈ సిరీస్​కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.

  • Published Feb 06, 2024 | 4:39 PMUpdated Feb 06, 2024 | 5:21 PM
IND vs ZIM: ఇండియా-జింబాబ్వే టీ20 సిరీస్‌! పూర్తి షెడ్యూల్‌ ఇదే..

ఇంగ్లండ్​తో ఆడిన రెండో టెస్టులో విజయం సాధించడంతో భారత జట్టు మంచి జోష్​లో ఉంది. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్​లో ఓడిపోవడంతో రోహిత్ సేనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్వదేశంలో టెస్టుల్లో ఓడిపోవడం ఏంటంటూ చాలా మంది భారత టీమ్ మీద ఫైర్ అయ్యారు. అయితే వీటన్నింటికీ టీమిండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. విశాఖపట్నం ఆతిథ్యం ఇచ్చిన రెండో టెస్టులో చెలరేగి ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈసారి కూడా బజ్​బాల్​తో భారత్​ను అలవోకగా ఓడిస్తామంటూ బడాయికి పోయిన ఇంగ్లీష్ టీమ్​ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బజ్​బాల్​ను ఓడించిన తొలి ఆసియా టీమ్​గా టీమిండియా అవతరించింది. ఈ ఫార్ములాను చిత్తు చేసిన తొలి ఆసియా కెప్టెన్​గా రోహిత్ నిలిచాడు. ఇదిలా ఉంటే.. మరో ఇంట్రెస్టింగ్ సిరీస్​కు టీమిండియా రెడీ అవుతోంది. జింబాబ్వేతో టీ20 సిరీస్​లో మన టీమ్ పాల్గొననుంది.

భారత జట్టు జింబాబ్వే పర్యటన ఖరారైంది. ఈ టూర్​కు సంబంధించిన పూర్తి షెడ్యూల్​ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్-2024 ముగిసిన తర్వాత జింబాబ్వేకు వెళ్లనుంది టీమిండియా. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో ఐదు టీ20ల్లో తలపడనుంది భారత్. జులై 6వ తేదీన జరిగే మొదటి టీ20తో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత జులై 7న రెండో మ్యాచ్, 10న మూడో మ్యాచ్, 13న నాలుగో మ్యాచ్ జరగనున్నాయి. జులై 14వ తేదీన జరిగే ఆఖరి టీ20తో జింబాబ్వే పర్యటన ముగుస్తుంది. జులై నెలలో ఈ సిరీస్​తో పాటు శ్రీలంకతో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్​లోనూ ఆడనుంది టీమిండియా. ఇలా జూన్​లో మొదలయ్యే టీ20 ప్రపంచ కప్ నుంచి జులై నెలాఖరు వరకు వివిధ సిరీస్​లతో భారత టీమ్ ఫుల్ బిజీగా ఉండనుంది.

జింబాబ్వే, శ్రీలంకతో సిరీస్​లకు సంబంధించిన జట్ల ప్రకటన టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఉంటుంది. అయితే ఎక్కువగా కుర్రాళ్లకు అవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్​ల్లో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సౌతాఫ్రికా టూర్, ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్, ఇప్పుడు ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​తో రోహిత్ అలసిపోయాడు. కోహ్లీ ఇంగ్లీష్ టీమ్​తో సిరీస్​లో తప్ప మిగిలిన మ్యాచుల్లో ఆడాడు. వీళ్లిద్దరూ నెక్స్ట్​ ఐపీఎల్​తో బిజీ అయిపోతారు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్​లో ఎలాగూ ఆడతారు. కాబట్టి వాళ్లకు రెస్ట్ ఇచ్చి యంగ్ ప్లేయర్స్​కు అవకాశాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ తర్వాత ఈ బిగ్ స్టార్స్ కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాల్నీ కొట్టిపారేయలేం. అయితే మెగా టోర్నీ తర్వాతే వీరి భవితవ్యంపై క్లారిటీ రానుంది.