Nidhan
Sikandar Raza: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. 26 ఏళ్ల తర్వాత సచిన్ షార్జా సిక్స్ రిపీట్ అయింది. ఆ షాట్‌ను చూసేందుకు రెండు కళ్లు చాలవంతే!
Sikandar Raza: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. 26 ఏళ్ల తర్వాత సచిన్ షార్జా సిక్స్ రిపీట్ అయింది. ఆ షాట్‌ను చూసేందుకు రెండు కళ్లు చాలవంతే!
Nidhan
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. లెక్కపెట్టలేనన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. వాటిల్లో టాప్-3లో నిలిచేది షార్జా ఇన్నింగ్స్ అనే చెప్పాలి. కోకాకోలా కప్‌లో ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ నెక్స్ట్ లెవల్ హిట్టింగ్తో అలరించాడు. సరిగ్గా మ్యాచ్‌కు ముందు దాదాపు అరగంట పాటు ఇసుక తుఫాన్ వచ్చింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ సీన్లోకి వచ్చింది. ఆ ట్రయాంగిల్ సిరీస్‌లో ఫైనల్‌కు చేరాలంటే డక్‌వర్త్ ప్రకారం భారత్ టార్గెట్‌ను 46 ఓవర్లలో 237 పరుగులుగా నిర్ణయించారు. ఇసుక తుఫాన్ తర్వాత సచిన్ బ్యాటింగ్ తుఫాన్ మొదలైంది.
టామ్ మూడీ, షేన్ వార్న్, మైకేల్ కాస్ప్రోవిచ్, డామిన్ ఫ్లెమింగ్ లాంటి కంగారూ బౌలర్లతో ఆడుకున్న సచిన్.. ఏకంగా 143 పరుగులు బాదేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా అతడి నాక్ వల్ల ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడిన క్రికెట్ దేవుడు.. గ్రౌండ్ నలువైపులా అద్భుతమైన షాట్లు కొట్టాడు. ఇదే క్రమంలో అతడు కొట్టిన కొన్ని స్ట్రయిట్ డ్రైవ్‌లు, స్ట్రయిట్ సిక్స్‌లు మ్యాచ్‌కే కాదు.. క్రికెట్ హిస్టరీలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయాయి. సరిగ్గా అదే షాట్ ఇవాళ భారత్-జింబాబ్వే మధ్య జరిగిన తొలి టీ20లో రిపీట్ అయింది.
ఆవేశ్ ఖాన్ వేసిన 10వ ఓవర్ మూడో బంతిని జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అచ్చం సచిన్ మాదిరిగానే స్ట్రయిట్ సిక్స్ బాదాడు. నిల్చున్న చోట నుంచి బౌలర్ తల మీదుగా కొట్టిన ఆ షాట్ చూసి అంతా షాకయ్యారు. మాస్టర్ బ్లాస్టర్ మాదిరిగానే స్వీట్ టైమింగ్, పర్ఫెక్ట్ బాడీ బ్యాలెన్స్‌తో రజా బాదిన ఈ షాట్‌ను చూడటానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. దీన్ని చూసిన క్రికెట్ లవర్స్ సచిన్ షార్జా ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న రజా.. 17 పరుగులు చేసి అదే ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మరి.. రజా సిక్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
— Johnson (@Johnson427427) July 6, 2024