Nidhan
భారత జట్టు మరో ఇంట్రెస్టింగ్ ఫైట్‌కు రెడీ అవుతోంది. జింబాబ్వే టూర్‌కు వెళ్లిన యంగ్ ఇండియా.. ఆ టీమ్‌తో 5 టీ20లు ఆడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.
భారత జట్టు మరో ఇంట్రెస్టింగ్ ఫైట్‌కు రెడీ అవుతోంది. జింబాబ్వే టూర్‌కు వెళ్లిన యంగ్ ఇండియా.. ఆ టీమ్‌తో 5 టీ20లు ఆడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024 సందడి ఇంకా ముగియలేదు. ట్రోఫీతో స్వదేశానికి సగర్వంగా తిరిగొచ్చిన రోహిత్ సేనకు అభిమానులు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. సొంత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి ఆటగాళ్లంతా బిజీ అయిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీని కలవడం, ఆ తర్వాత ముంబైలో విక్టరీ పరేడ్ నిర్వహించడం, వాంఖడే స్టేడియాన్ని సందర్శించడం.. ఇలా ఒక్కో ప్రోగ్రామ్‌కు అటెండ్ అవుతూ హల్చల్ చేస్తున్నారు. ఒకవైపు విక్టరీ సెలబ్రేషన్స్ ఇలా కంటిన్యూ అవుతున్న తరుణంలో భారత జట్టు మరో సిరీస్‌కు సిద్ధమైపోయింది. శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని యంగ్ ఇండియా జింబాబ్వే టూర్‌కు వెళ్లింది. ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న కుర్రాళ్లు.. రేపటి నుంచి టీ20 సిరీస్‌లో జింబాబ్వేను ఢీకొట్టనున్నారు.
భారత్-జింబాబ్వే సిరీస్‌లో భాగంగా 5 టీ20ల సిరీస్ శనివారం స్టార్ట్ అవుతుంది. హరారే మైదానంలో జరిగే మొదటి మ్యాచ్‌తో సిరీస్‌కు తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌లో మన జట్టు ఎలాంటి ప్లానింగ్‌తో ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్లు లేకుండా ఎలా ఆడుతుంది, జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అలాగే ఎలాంటి స్క్వాడ్‌తో బరిలోకి దిగుతుందనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ తరుణంలో కెప్టెన్ గిల్ ఓ విషయాన్ని బయటపెట్టాడు. తొలి టీ20లో కొత్త ఓపెనింగ్ జోడీ ఆడుతుందని తెలిపాడు. అరంగేట్ర ఆటగాడు అభిషేక్ శర్మతో కలసి తాను ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేస్తానని గిల్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ మధ్య కాలంలో భారత జట్టులో సీనియర్లు లేని సమయంలో శుబ్‌మన్ గిల్‌తో కలసి రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. జింబాబ్వే సిరీస్‌లోనూ కెప్టెన్‌తో కలసి అతడే ఇన్నింగ్స్ మొదలుపెడతాడని అంతా భావించారు. అభిషేక్ శర్మను రెండు, మూడు మ్యాచ్‌ల తర్వాత టీమ్‌లోకి తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అప్పటివరకు గైక్వాడ్ ఓపెనర్‌గా దిగుతాడని కామెంట్లు వచ్చాయి. అయితే గిల్ మాత్రం తొలి మ్యాచ్‌కు ముందే ఓపెనింగ్ జోడీపై స్పష్టత ఇచ్చాడు. అభిషేక్‌తో కలసి తాను ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేస్తానని చెప్పడంతో రుతురాజ్ బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు రావడం ఖాయంగా మారింది. అయితే అతడ్ని ఫస్ట్ డౌన్లో ఆడిస్తారా? లేదా నాలుగో నంబర్లో ఆడిస్తారా? అనేది చూడాలి. మరి.. టీమిండియా నయా ఓపెనింగ్ జోడీ అద్భుతాలు చేస్తుందని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
Shubman Gill confirms he and Abhishek Sharma will open for India tomorrow against Zimbabwe. pic.twitter.com/YSgrIcdcGW
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2024