Shubman Gill: జింబాబ్వేతో టీమిండియా సిరీస్.. కెప్టెన్ గిల్ ముందు ఉన్న సవాళ్లు ఇవే!

టీ20 వరల్డ్ కప్-2024 హడావుడి ఇంకా ముగియలేదు. కప్పు గెలిచిన భారత ఆటగాళ్లు త్వరలో స్వదేశానికి చేరుకోనున్నారు. ఈ తరుణంలో మరో ఆసక్తికర సిరీస్​కు రంగం సిద్ధమవుతోంది.

టీ20 వరల్డ్ కప్-2024 హడావుడి ఇంకా ముగియలేదు. కప్పు గెలిచిన భారత ఆటగాళ్లు త్వరలో స్వదేశానికి చేరుకోనున్నారు. ఈ తరుణంలో మరో ఆసక్తికర సిరీస్​కు రంగం సిద్ధమవుతోంది.

టీ20 వరల్డ్ కప్-2024 హడావుడి ముగియలేదు. కప్పు గెలిచిన భారత ఆటగాళ్లు త్వరలో స్వదేశానికి చేరుకోనున్నారు. ఒకవైపు ప్లేయర్లతో పాటు కోట్లాది మంది అభిమానులంతా టైటిల్ నెగ్గిన సంతోషంలో ఉండగా.. మరోవైపు మెన్ ఇన్ బ్లూ మరో ఆసక్తికర సిరీస్​కు సిద్ధమవుతోంది. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్​కు రెడీ అవుతోంది మన జట్టు. జులై 6వ తేదీ నుంచి మొదలవనున్న ఈ సిరీస్​లో టీమిండియాకు యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. గిల్​తో పాటు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, తుషాద్ దేశ్​పాండే ఈ సిరీస్​లో భారత్​ తరఫున బరిలోకి దిగనున్నారు.

జింబాబ్వేతో సిరీస్​కు బలమైన లైనప్​తో ఉన్న జట్టును ఎంపిక చేశారు సెలెక్టర్లు. టీమ్​లో స్ట్రాంగ్ బ్యాటర్లతో పాటు అంతే బలమైన బౌలర్లు కూడా ఉన్నారు. దీంతో ఈ సిరీస్​ను భారత్ క్లీన్​స్వీప్ చేయడం ఖాయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అయితే అవతల ఉన్న జింబాబ్వేను లైట్ తీసుకోవడానికి లేదు. కెప్టెన్ సికందర్ రజాతో పాటు కొందరు డేంజరస్ ప్లేయర్లు ఆ టీమ్​లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ గిల్ ముందున్న పలు సవాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నయా సారథి ముందు ఉన్న తొలి సవాల్ ఓపెనర్​గా, బ్యాటర్​గా సత్తా చాటడం. గత కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ రెగ్యులర్ ప్లేయర్​గా మారాడు గిల్. అతడి టాలెంట్ చూసే ఇప్పుడు కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది. కాబట్టి అతడు ఈ సిరీస్​లో పరుగుల వర్షం కురిపించాలి. రోహిత్ శర్మ ప్లేస్​లో తానే ఓపెనర్​గా కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి.

జింబాబ్వే సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయడం గిల్ ముందు ఉన్న ఇంకో సవాల్. ఆ టీమ్​ను వైట్​వాష్ చేయడం ద్వారా సారథిగా రోహిత్​కు సిసలైన వారసుడ్ని తానేనని అతడు నిరూపించుకోవాలి. మరో ఛాలెంజ్ ఏంటంటే.. గిల్ తాను రాణించడమే గాక జట్టులోని ఇతర ఆటగాళ్ల నుంచి కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్​ను రాబట్టాలి. ఒకవేళ టీ20ల్లో కెప్టెన్​గా గిల్ సక్సెస్ అయితే.. ఫ్యూచర్​లో వన్డేల్లోనూ రోహిత్ నుంచి సారథ్య పగ్గాలు తీసుకోవచ్చు. కెప్టెన్సీ రేసులో ఉన్న హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ లాంటి వారిని అధిగమిచాలంటే జింబాబ్వే సిరీస్ అతడికి ఎంతో కీలకం.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇక మీదట వీళ్లు వన్డేలు, టెస్టులకే పరిమితం కానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కేవలం 6 వన్డేలు మాత్రమే జరగనున్నాయి. కాబట్టి రోకో జోడీని ఇకపై టెస్టుల్లోనే ఎక్కువగా చూడనున్నాం. వీళ్లిద్దరి ఎరా ముగిసింది. కాబట్టి టీమిండియా నుంచి మరో లెజెండ్ పుట్టుకకు ఇది ఆరంభం కావాలి. ఆ ఇద్దరి నుంచి బ్యాటన్​ను పట్టుకొని భారత క్రికెట్​ను ముందుకు నడిపించే సత్తా ఉన్నోడు కావాలి. అది తానేనని ప్రూవ్ చేయడానికి గిల్​కు ఇదే బెస్ట్ ఛాన్స్. మరి.. శుబ్​మన్ ఎదుర్కొంటున్న సవాళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments