iDreamPost
android-app
ios-app

Sanju Samson: వీడియో: సంజూ శాంసన్ పిచ్చికొట్టుడు.. దెబ్బకు పత్తా లేకుండా పోయిన బాల్!

  • Published Jul 14, 2024 | 6:59 PM Updated Updated Jul 14, 2024 | 6:59 PM

టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ జింబాబ్వే బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టాడు. భారీ షాట్లతో వాళ్లపై విరుచుకుపడ్డాడు. అతడు బాదిన ఓ బంతి అడ్రస్ లేకుండా పోయింది.

టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ జింబాబ్వే బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టాడు. భారీ షాట్లతో వాళ్లపై విరుచుకుపడ్డాడు. అతడు బాదిన ఓ బంతి అడ్రస్ లేకుండా పోయింది.

  • Published Jul 14, 2024 | 6:59 PMUpdated Jul 14, 2024 | 6:59 PM
Sanju Samson: వీడియో: సంజూ శాంసన్ పిచ్చికొట్టుడు.. దెబ్బకు పత్తా లేకుండా పోయిన బాల్!

టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ జింబాబ్వే బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టాడు. భారీ షాట్లతో వాళ్లపై విరుచుకుపడ్డాడు. అతడు బాదిన ఓ బంతి అడ్రస్ లేకుండా పోయింది. ఇదంతా ఐదో టీ20లో చోటుచేసుకుంది. రెండు జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్​లో సంజూ ధనాధన్ బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. 45 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఒక్క బౌండరీ మాత్రమే బాదిన ఈ స్టైలిష్ బ్యాటర్.. 4 భారీ సిక్సులు కొట్టాడు. అందులో ఒక బాల్ ఏకంగా 110 మీటర్ల దూరంలో వెళ్లి పడింది.

సంజూ కొట్టిన దెబ్బకు బాల్ కనిపించకుండా పోయింది. టపాటపా వికెట్లు పడటంతో మొదట్లో మెళ్లిగా ఆడిన సంజూ ఆ తర్వాత వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. అలాగని అడ్డగోలు షాట్లు ఆడలేదు. తనదైన స్వీట్ టైమింగ్​తో రన్స్ పిండుకున్నాడు. రియాన్ పరాగ్ (22) ఫర్వాలేదనిపించాడు. అయితే ఆఖర్లో శివమ్ దూబె (26) చెలరేగడంతో 20 ఓవర్లు ముగిసేసరికి గిల్ సేన 167 పరుగులు చేసింది. మ్యాచ్​లో నెగ్గాలంటే భారత బౌలర్లు చెమటోడ్చక తప్పదు. అయితే ఆల్రెడీ సిరీస్ గెలిచాం కాబట్టి ఒకవేళ ఓడినా పెద్దగా పోయేదేమీ లేదు. కానీ టూర్​ను గెలుపుతో ముగిస్తే ఫుల్ పాజిటివిటీ ఉంటుంది. మరి.. సంజూ బ్యాటింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.