Nidhan
భారత క్రికెట్ బోర్డు మరోమారు తన మంచి మనసును చాటుకుంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మాజీ క్రికెటర్‌ను ఆదుకునేందుకు నడుం బిగించింది.
భారత క్రికెట్ బోర్డు మరోమారు తన మంచి మనసును చాటుకుంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మాజీ క్రికెటర్‌ను ఆదుకునేందుకు నడుం బిగించింది.
Nidhan
భారత క్రికెట్ బోర్డు తన పనితీరుతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. టీ20 ప్రపంచ కప్-2024 ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ఇచ్చి వాళ్ల సేవలను తగినట్లుగా గుర్తించింది బీసీసీఐ. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన బార్బడోస్ నుంచి ప్లేయర్లు, వాళ్ల ఫ్యామిలీస్‌ను స్పెషల్ ఫ్లైట్‌లో ఇండియాకు తీసుకొచ్చింది. అలాగే మన దేశ మీడియా ప్రతినిధులను కూడా ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. అనంతరం ఆటగాళ్లను ఓపెన్ బస్‌లో ఎక్కించి ఘనంగా విక్టరీ పరేడ్ నిర్వహించింది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో వాళ్లను సత్కరించింది. ఇప్పుడు కూడా మరో మంచి పనితో అందరి హృదయాలను గెలుచుకుంది.
భారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్‌కు బీసీసీఐ భారీ సాయం చేసింది. అతడి ట్రీట్మెంట్ కోసం ఏకంగా రూ.1 కోటిని ప్రకటించింది. 71 ఏళ్ల అన్షుమన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఏడాది కాలంగా బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయన వైద్య ఖర్చుల కోసం నిధులు సేకరించేందుకు లెజెండరీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్నాథ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్‌లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ తమ వంతుగా కృషి చేస్తున్నారు. వాళ్లతో పాటు 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ కూడా ఎంతో ప్రయత్నించాడు. అన్షుమన్ ట్రీట్మెంట్ కోసం అవసరమైతే తన పెన్షన్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధమని ప్రకటించాడు.
అన్షుమన్తో కలసి క్రికెట్ ఆడానని.. అతడ్ని ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నానంటూ కపిల్ దేవ్ ఆవేదనను వ్యక్తం చేశాడు. అరివీర భయంకరులైన బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో ఎన్నో దెబ్బలు తిన్నాడని.. అలాంటోడి కోసం మనమంతా కలసికట్టుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. ఆయన ఆరోగ్యం గురించి భారత బోర్డు దగ్గరకు కూడా తీసుకెళ్లాడు. ఇలా దిగ్గజ క్రికెటర్లు అందరూ అన్షుమన్ కోసం తమ వంతుగా కృషి చేయడం, ఆ విషయం తమ దృష్టికి రావడంతో బీసీసీఐ అలర్ట్ అయింది. ఆయన వైద్య ఖర్చుల కోసం కోటి రూపాయలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అన్షుమన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. మరి.. మాజీ క్రికెటర్‌కు బోర్డు అండగా నిలవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Jay Shah has informed the BCCI to provide a 1cr financial support to India’s former cricketer Anshuman Gaekwad who’s battling with Cancer.
– Kudos to the BCCI and Jay Shah! 👏 pic.twitter.com/nQ0SVotN5u
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024