Ravi Bishnoi: వీడియో: రవి బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్.. యువరాజ్​ను గుర్తుచేశాడు!

India vs Zimbabwe: టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పేరు చెబితే అంతా అతడి మ్యాజికల్ స్పిన్ గురించే చెబుతారు. కానీ తనలో ఎంత మంచి ఫీల్డర్ ఉన్నాడో అతడు మరోమారు ప్రూవ్ చేశాడు.

India vs Zimbabwe: టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పేరు చెబితే అంతా అతడి మ్యాజికల్ స్పిన్ గురించే చెబుతారు. కానీ తనలో ఎంత మంచి ఫీల్డర్ ఉన్నాడో అతడు మరోమారు ప్రూవ్ చేశాడు.

టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పేరు చెబితే అంతా అతడి మ్యాజికల్ స్పిన్ గురించే చెబుతారు. కానీ తనలో ఎంత మంచి ఫీల్డర్ ఉన్నాడో అతడు ప్రూవ్ చేశాడు. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో ఒక స్టన్నింగ్ క్యాచ్​ను అందుకున్నాడు బిష్ణోయ్. ఆవేశ్‌ ఖాన్ వేసిన నాలుగో ఓవర్​లో బెన్నెట్ ఇచ్చిన క్యాచ్​ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడతను. ఆఫ్ స్టంప్​కు అవతల పడిన బంతిని భారీ షాట్​గా మలిచేందుకు ప్రయత్నించాడు జింబాబ్వే బ్యాటర్. అయితే కాచుకొని ఉన్న బిష్ణోయ్​ పక్షి మాదిరిగా గాల్లోకి ఎగిరి దాన్ని అందుకున్నాడు.

బంతి వేగాన్ని, ఎత్తును సరిగ్గా అంచనా వేసి కరెక్ట్ టైమ్​లో జంప్ చేసి బాల్​ను అందుకున్నాడు బిష్ణోయ్. అతడి క్యాచ్​ను చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. లెజెండ్ యువరాజ్ సింగ్​ను గుర్తుచేశాడని అంటున్నారు. యువీ కూడా అదే పొజిషన్​లో ఫీల్డింగ్​ చేస్తూ ఎన్నో సూపర్ క్యాచ్​లు పట్టుకున్నాడు. ఇప్పుడు బిష్ణోయ్ కూడా అదే చేశాడని చెబుతున్నారు. బిష్ణోయ్ అంటే స్పిన్నరే అనుకున్నాం.. ఈ రేంజ్ ఫీల్డర్ అనుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్ ఓవర్లన్నీ ఆడి 182 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్​కు దిగిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. ఈ గెలుపుతో సిరీస్​లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది గిల్ సేన. మరి.. బిష్ణోయ్​ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments