Ravi Bishnoi: జింబాబ్వేను కుప్పకూల్చిన రవి బిష్ణోయ్.. వాళ్లపై పగతో రెచ్చిపోయాడు!

India vs Zimbabwe: టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో ఫస్ట్ మ్యాచ్​లోనే జింబాబ్వేకు చుక్కలు కనిపించాయి. భారత బౌలర్ల ధాటికి ఆ టీమ్​ వణికిపోయింది.

India vs Zimbabwe: టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో ఫస్ట్ మ్యాచ్​లోనే జింబాబ్వేకు చుక్కలు కనిపించాయి. భారత బౌలర్ల ధాటికి ఆ టీమ్​ వణికిపోయింది.

టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో ఫస్ట్ మ్యాచ్​లోనే జింబాబ్వేకు చుక్కలు కనిపించాయి. భారత బౌలర్ల ధాటికి ఆ టీమ్​ వణికిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ రవి బిష్ణోయ్ దెబ్బకు ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో నిలబడేందుకు భయపడ్డారు. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ శుబ్​మన్ గిల్ అపోజిషన్ టీమ్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. దీంతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. స్కోరు బోర్డు మీదకు 6 పరుగులు చేరేలోపే ఓపెనర్ ఇన్నోసెంట్ కైరా (0) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వెస్లీ (21), బ్రియాన్ బెన్నెట్ (22) బాగా ఆడారు. కానీ బిష్ణోయ్ రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

5 ఓవర్లలో వికెట్ నష్టానికి 40 పరుగులతో ఉన్న జింబాబ్వేను కుప్పకూల్చాడు బిష్ణోయ్. వెస్లీతో పాటు బెన్నెట్​ను అతడు క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సికిందర్ రజా (17) క్రీజులో సెటిల్ అయినట్లే కనిపించాడు. కానీ అతడ్ని పేసర్ అవేశ్ ఖాన్ వెనక్కి పంపాడు. మేయర్స్ (23), మసకద్జా (0)ను మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ల్యూక్ జాంగ్వే (1), బ్లెస్సింగ్ ముజారబానీ (0)ని బిష్ణోయ్ పెవిలియన్​కు పంపాడు. మొత్తంగా 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడతను. గత కొన్నాళ్లుగా టీమ్​లో రెగ్యులర్​ ప్లేయర్​గా ఉన్నప్పటికీ తనను వరల్డ్ కప్​కు ఎంపిక చేయలేదని సెలెక్టర్లపై పగతో రగిలిపోతున్న బిష్ణోయ్.. ఆ కసిని మ్యాచ్​లో చూపించాడు. అతడితో పాటు సుందర్ 2 వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించాడు. ఓవర్లన్నీ ముగిసేసరికి ఆతిథ్య జట్టు 9 వికెట్లకు 115 రన్స్ చేసింది.

Show comments