Nidhan
India vs Zimbabwe: వరల్డ్ కప్ నెగ్గి జోష్ మీదున్న భారత జట్టుకు పసికూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. తొలి టీ20లో టీమిండియాను ఓడించిందా జట్టు.
India vs Zimbabwe: వరల్డ్ కప్ నెగ్గి జోష్ మీదున్న భారత జట్టుకు పసికూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. తొలి టీ20లో టీమిండియాను ఓడించిందా జట్టు.
Nidhan
టీ20 వరల్డ్ కప్ నెగ్గి జోష్ మీదున్న భారత జట్టుకు పసికూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. తొలి టీ20లో టీమిండియాను 13 పరుగుల తేడాతో ఓడించింది జింబాబ్వే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్‌ను మెన్ ఇన్ బ్లూ ఊదిపారేస్తుందని అనుకుంటే 102 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో మన జట్టు దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. పేసర్ ఆవేశ్ ఖాన్ చెత్త ఫీల్డింగ్‌తో టీమ్ పరువు తీశాడు. చేతిలోకి వచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను అతడు వదిలేశాడు.
ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఓ జింబాబ్వే బ్యాటర్ ఆఫ్ సైడ్ షాట్ కొట్టాడు. అయితే సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచిన బంతి కాస్తా థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఆవేశ్ ఖాన్ దాన్ని ఈజీగా అందుకోవాల్సింది. కానీ అతడు ఎడమ వైపు బాడీని సరిగ్గా స్ట్రెచ్ చేయకపోవడంతో క్యాచ్ కాస్తా నేలపాలైంది. నిల్చున్న చోట నుంచి రెండు అడుగులు వేసి అందుకోవాల్సిన క్యాచ్‌ను డైవ్ చేసి పట్టేందుకు ప్రయత్నించడం, బాడీ మూమెంట్, హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ కరెక్ట్‌గా లేకపోవడంతో క్యాచ్ మిస్ అయింది. ఈజీ క్యాచ్‌ను వదిలేయడంతో బౌలర్ ఖలీల్ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే అతడు కోపాన్ని అణచుకొని కామ్‌గా ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
— Azam Khan (@AzamKhan6653) July 6, 2024