Abhishek Sharma: నేను డకౌట్ అయితే యువరాజ్ ఫుల్ హ్యాపీ.. సెంచరీ హీరో అభిషేక్ శర్మ కామెంట్స్!

జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్​లో భారత్ సూపర్బ్​గా కమ్​బ్యాక్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్​లో తగిలిన షాక్ నుంచి వెంటనే తేరుకున్న యంగ్ ఇండియా.. రెండో మ్యాచ్​లో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది.

జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్​లో భారత్ సూపర్బ్​గా కమ్​బ్యాక్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్​లో తగిలిన షాక్ నుంచి వెంటనే తేరుకున్న యంగ్ ఇండియా.. రెండో మ్యాచ్​లో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది.

జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్​లో భారత్ సూపర్బ్​గా కమ్​బ్యాక్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్​లో తగిలిన షాక్ నుంచి వెంటనే తేరుకున్న యంగ్ ఇండియా.. రెండో మ్యాచ్​లో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. తొలి టీ20కి వేదికగా నిలిచిన హరారే స్పోర్ట్స్ క్లబ్​లో జరిగిన మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన శుబ్​మన్ సేన నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. కొత్త ఓపెనర్ అభిషేక్ శర్మ (47 బంతుల్లో 100) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్) కూడా ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన జింబాబ్వే.. 18.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది.

ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ చెరో 3 వికెట్లతో జింబాబ్వే పనిపట్టారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా 2 వికెట్లతో సత్తా చాటాడు. సెంచరీతో చెలరేగిన అభిషేక్​ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్​ను 1-1తో సమం చేసింది భారత్. ఈ మ్యాచ్​లో శతకంతో అదరగొట్టిన అభిషేక్.. మ్యాచ్ తర్వాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తొలి మ్యాచ్​లో డకౌట్ అయినందుకు బాధేసిందని, అయితే దాని గురించి ఆలోచించేందుకు అంత టైమ్ దొరకలేదన్నాడు. గ్యాప్ లేకుండా రెండో టీ20 ఆడటంతో ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్​ను మర్చిపోయానన్నాడు అభిషేక్. ఎందుకో ఇన్నింగ్స్ స్టార్ట్ అవగానే.. ఈ రోజు తనదేనని అనిపించిందని, ఆ జోష్​తో బ్యాటింగ్ చేశానన్నాడు. అయితే తన గురువు యురాజ్ సింగ్ మాత్రం తాను డకౌట్ అయితే సంబురపడతానని చెప్పాడు.

‘నేను యువరాజ్ సింగ్​తో మాట్లాడా. నేను మొదటి మ్యాచ్​లో డకౌట్ అవడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇంటర్నేషనల్ కెరీర్​కు ఇది మంచి స్టార్ట్ అని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయా. కానీ నా సక్సెస్ విషయంలో మా కుటుంబంలాగే యువీ కూడా ఎంతో గర్వపడతాడు. ఆ సంగతి నాకు తెలుసు’ అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. ఇక, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని తన డెబ్యూ మ్యాచ్​లో జీరో రన్స్​కు ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత మాత్రం వెనుదిరిగి చూసుకోలేదు. కాగా, రెండో టీ20లో అభిషేక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వచ్చిన బాల్​ను వచ్చినట్లు స్టాండ్స్​లోకి తరలిస్తూ తనలోని విధ్వంసకారుడ్ని వరల్డ్ క్రికెట్​కు పరిచయం చేశాడు అభిషేక్. సెంచరీతో తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. మరి.. తాను డకౌట్ అయితే యువీ హ్యాపీ అంటూ అభిషేక్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments