Nidhan
స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. బీసీసీఐ అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. బీసీసీఐ అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Nidhan
స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. బీసీసీఐ అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధపడుతూనే వన్డే ప్రపంచ కప్-2023లో ఆడాడు అయ్యర్. మెగాటోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో ఆ ఏడాది ఐపీఎల్ సీజన్‌నూ వదిలేసుకున్నాడు. వరల్డ్ కప్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందర్నీ మెప్పించాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా సిరీస్‌లోనూ పాల్గొన్నాడు. అలాగే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లోనూ ఆడాడు. అయినా బోర్డు అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. వెన్ను నొప్పి అని చెప్పిన అయ్యర్‌ను ఎన్సీఏకు పంపిన బోర్డు.. రికవర్ అయ్యాక రంజీల్లో ఆడమని ఆదేశించింది. అయితే గాయం మళ్లీ తిరగబెడుతుందనే భయంతో అతడు ఎన్సీఏలోనే ఉండిపోయాడు.
ఫిట్‌గా ఉన్నా రంజీల్లో ఆడకుండా తమ మాటల్ని బేఖాతరు చేశాడనే కారణంతో అయ్యర్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది. అలాగే టీ20 వరల్డ్ కప్‌కూ అతడ్ని సెలెక్ట్ చేయలేదు. అయితే కసిగా ఉన్న శ్రేయస్.. ఐపీఎల్లో సూపర్ పెర్ఫార్మెన్స్తో తన జట్టయిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కప్పు అందించాడు. ఇప్పుడు కూడా టీమిండియాకు ఆడాలనే సంకల్పంతో మ్యాచులు లేకున్నా కఠోరంగా సాధన చేస్తున్నాడు. ఫిట్నెస్ను కాపాడుకోవడం, బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపర్చుకోవడంపై పని చేస్తున్నాడు. అయితే అయ్యర్ కష్టాలు తీరనున్నాయని తెలుస్తోంది. అతడ్ని టీమిండియాలోకి తీసుకొచ్చేందుకు కేకేఆర్ మాజీ మెంటార్, భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ జోరుగా ప్రయత్నిస్తున్నాడని సమాచారం.
ప్రస్తుతం భారత జట్టు జింబాబ్వే టూర్లో బిజీగా ఉంది. ఈ నెలాఖరులో శ్రీలంకతో సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్‌లో ఆడే టీమ్‌లోని హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చి.. అతడి స్థానంలో అయ్యర్‌ను రీప్లేస్ చేయాలని గంభీర్ భావిస్తున్నాడట. ఐపీఎల్‌తో పాటు వెంటనే వరల్డ్ కప్‌లో ఆడిన హార్దిక్ బాగా అలసిపోయాడు. ఈ మధ్య గాయాల నుంచి రికవర్ అయిన అతడ్ని ఎక్కువ క్రికెట్ ఆడించడం సరికాదనే ఉద్దేశంతో విశ్రాంతి ఇవ్వాలని గౌతీ భావిస్తున్నాడట. అతడితో పాటు కీపర్ పంత్‌కు కూడా రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. అదే టైమ్‌లో కేకేఆర్ కెప్టెన్ అయిన అయ్యర్‌ను టీమ్‌లోకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. హార్దిక్, పంత్‌లో ఒక పొజిషన్‌కు అయ్యర్‌ను రీప్లేస్ చేయాలని డిసైడ్ అయ్యాడట. శ్రేయస్ రీఎంట్రీ కోసం సెలెక్టర్లను ఒప్పించే పనిలో ఉన్నాడట గంభీర్. అయితే అతడు జట్టులోకి వస్తాడా? లేదా? అనేది కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. మరి.. అయ్యర్ రీఎంట్రీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.