శ్రీలంకతో రెండో T20కి టీమిండియా రెడీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!

India vs Sri Lanka: తొలి టీ20లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా.. రెండో మ్యాచ్​కు రెడీ అవుతోంది. మరోమారు లంకను చిత్తు చేసి ఇక్కడే సిరీస్​ను పట్టేయాలని చూస్తోంది.

India vs Sri Lanka: తొలి టీ20లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా.. రెండో మ్యాచ్​కు రెడీ అవుతోంది. మరోమారు లంకను చిత్తు చేసి ఇక్కడే సిరీస్​ను పట్టేయాలని చూస్తోంది.

శ్రీలంక సిరీస్​ను గ్రాండ్​గా స్టార్ట్ చేసింది టీమిండియా. తొలి టీ20లో ఆతిథ్య జట్టును 43 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అన్ని విభాగాల్లోనూ భారత్​దే ఆధిపత్యం నడిచింది. కెప్టెన్ సూర్యకుమార్ ముందుండి టీమ్​ను నడిపించాడు. బ్యాటింగ్​లో అగ్రెసివ్ అప్రోచ్​తో ఆడుతూ మిగతా వారితోనూ అలాగే ఆడించాడు. బౌలింగ్ టైమ్​లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ, మంచి ఫీల్డింగ్ ప్లేసెస్, బౌలింగ్ ఛేంజెస్ చేస్తూ టీమ్​కు సక్సెస్ అందించాడు. తొలి టీ20లో గ్రాండ్ విక్టరీతో జోష్​లో ఉన్న టీమిండియా.. రెండో మ్యాచ్​కు రెడీ అవుతోంది. మరోమారు లంకను చిత్తు చేసి ఇక్కడే సిరీస్​ను పట్టేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే రెండో టీ20లో మన టీమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

తొలి టీ20లో ఓపెనర్లు శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్ అదరగొట్టారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్, రిషబ్ పంత్ కూడా సూపర్బ్ ఇన్నింగ్స్​లతో మెరిశారు. కాబట్టి ఈ నలుగురే టాపార్డర్​లో బ్యాటింగ్ చేయడం ఖాయం. వీళ్ల తర్వాత వచ్చే హార్దిక్ పాండ్యా గత మ్యాచ్​లో ఫెయిలయ్యాడు. బ్యాటింగ్​లో 9 పరుగులు చేసి క్రీజును వీడిన పాండ్యా.. బౌలింగ్​లో 41 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయినా పేస్ ఆల్​రౌండర్ కాబట్టి అతడి ప్లేస్​కు ఢోకా ఉండదు. పించ్ హిట్టర్ కోటాలో రింకూ సింగ్ ఆడటం కూడా పక్కా. స్పిన్ ఆల్​రౌండర్​గా అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్​గా రవి బిష్ణోయ్ బరిలోకి దిగడం ఖాయం.

రెండో టీ20లో కూడా పేస్ బౌలింగ్ రెస్పాన్సిబిలిటీని అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ పంచుకుంటారు. ఈ మ్యాచ్​లోనూ నెగ్గి సిరీస్​ను సొంతం చేసుకుంటే.. ఇతర ఫాస్ట్ బౌలర్లకు ఆఖరి టీ20లో ఛాన్స్ దక్కొచ్చు. ఇక, మొదటి టీ20లో బ్యాటింగ్​లో ఫెయిలైన రియాన్ పరాగ్ ప్లేస్​ కొంత డౌట్​గా మారింది. 7 పరుగులు చేసిన పరాగ్.. బౌలింగ్​లో మాత్రం దుమ్మురేపాడు. 3 కీలక వికెట్లు తీసి లంక నడ్డి విరిచాడు. బ్యాటింగ్ ఎబిలిటీతో పాటు బౌలింగ్ వేస్తాడు కాబట్టి పరాగ్​ ప్లేయింగ్ ఎలెవన్​లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ తొలి మ్యాచ్​లో సంజూ శాంసన్​ను ఆడించనందుకు, ఎంతో జూనియర్ అయిన పరాగ్​ను టీమ్​లోకి తీసుకున్నందుకు తీవ్ర విమర్శలు వచ్చాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని పరాగ్​ను కాదని సంజూను టీమ్​లోకి తీసుకొచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఈ ఒక్క మార్పు మినహా మొదటి మ్యాచ్​లో ఆడిన టీమ్​నే కంటిన్యూ చేసే ఛాన్సులు బలంగా ఉన్నాయి. మరి.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​లో ఇంకా ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

భారత జట్టు (అంచనా):
శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్/సంజూ శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

Show comments